తెలంగాణ

కరోనాను నిరోధించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: రాష్ట్ర ప్రభుత్వ కేంద్రీకృత వ్యవహారం శైలి కారణంగా శాస్తవ్రేత్తలు, డాక్టర్లు, నిపుణులతో నిరంతరం పర్యవేక్షించాల్సిన కరోనా అంశంపై వ్యవహరిస్తున్న తీరుపట్ల తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోరానా పట్ల అది మూడు, నాలుగో ధశలోకి వస్తే అరికట్టడం అసాధ్యమనే వాతావరణంలో ఈనెల రోజులు కీలకమైనవనే అవగాహనతో ప్రభుత్వం వ్యవహరించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ పేర్కొన్నారు. వెంటనే నిపుణులతో తన సిబ్బందితో పూర్తి అధికారంతో స్వతంత్ర కంట్రోల్ రూమ్‌ను ఎర్పాటు చేసి అన్ని సంబందిత వ్యవస్థలను అనుసందానం చేస్తూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కనీసం కోటి భద్రత మస్కులను తక్షణమే సేకరించి ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పూణేలో ఉన్న శాంపిల్ నిర్ధారణ కేంద్రంకు అనుబంధంగా హైదరాబాద్‌లో ఏర్పాటుకు కృషి చేయాలని, ఐసోలేషన్ కేంద్రాలను హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు విస్తరించాలని, అన్ని ప్రధాన కేంద్రాలలో మాస్ అటాక్‌ను తట్టుకునేందుకు గాను 1000 పడగల అసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ సమావేశంలోఓబీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు అల్లంపల్లి రామ్ కోటి, వేల్పుల బిక్షపతి, చపర్తి కుమార స్వామి రజక, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ నాగభూషణం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.