తెలంగాణ

కేసీఆర్ పాలన అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: రాష్ట్రంలో కేసీఆర్ పాలన అద్భుతంగా పని చేస్తునందున ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు తెరాసకు పట్టం కట్టారని, దీంతో పార్టీ విజయఢంకా మోగించిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అన్నారు. శనివారం శాసన మండలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై జరిగిన చర్చల్లో పాల్గొన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ తీసుకువస్తున్న వినూత్న పథకాలు దేశ వ్యాప్తంగా ప్రసంశలు అందుకుంటున్నాయని మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలపై అవగాహన లేకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శలకు దిగడం శోచనీయమన్నారు. తెలంగాణకు ముందు తర్వాత జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే కేసీఆర్ చూపిన ప్రగతి స్పష్టంగా కన్పిస్తుందన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతు ఆత్మహత్యలు తగ్గాయని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఏర్పాటు చేసిన సబ్‌ప్లాన్ నిధులు ఆయా వార్గలకే చెందాలని సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ (కరోనా) వైరస్‌ను అరికట్టడానికి ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. మరో ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు తెలంగాంలో విలీనం కావాలని పట్టబడుతున్నాయని ఆయన గుర్తు చేశారు. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆకలిచావులు జరుగుతుంటే సిరిసిల్లను ఉరిసిల్లగా ప్రచారం జరిగిందన్నారు.అయితే కేటీఆర్ సిరిసిల్లను బంగారు సిరిసిల్లగా మార్చారని ఆయన అన్నారు. నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ కుల, చేతి వృత్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
ఎమ్మెల్సీ మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో గంగపుత్రులు, ముదిరాజ్, గౌడ్ కులాలను ఆదుకోవడానికి కేసీఆర్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వపై చేస్తున్న విమర్శిలపై ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. జీవన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు చూస్తే మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. పురాణం సతీష్ మాట్లాడుతూ జీవన్‌రెడ్డి జగిత్యాలలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందేవారు కాదని, అయితే టీఆర్‌ఎస్ ప్రభంజనాన్ని జీవన్‌రెడ్డి తట్టుకోలేక ఓటమి చెందారని ఆయన గుర్తు చేశారు.