తెలంగాణ

చెప్పిందే చెబుతున్నారు.. గత ఆరేళ్లూ ఇదే తంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: గత ఆరేళ్లుగా చెప్పిం దే చెబుతూ తెలంగాణ సమాజాన్ని మభ్యపెడుతున్నారని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం శాసన మండలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన చర్చల్లో పాల్గొన్న రామచంద్రరావు మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై తక్షణం శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి సమావేశాల్లో చెప్పిన అంశాలే మళ్లీ చెప్పడం దుర్మార్గం అన్నారు. పదేపదే చెప్పడంతో మా చెవులు గియ్యిమని శబ్ధం తట్టకోలేక పోతున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతభత్యాల సవరణపై ప్రభుత్వం జాప్యం చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. కేసీఆర్ ఉద్యోగులతో సఖ్యతగా పని చేయించలేకపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌కు కేసీఆర్ మొగ్గుచూపితే రాబోవు రోజుల్లో విద్యావ్యవస్థ ప్రమాదంలో పడుతుందన్నారు. కీసర వద్ద తన ఫామ్ హౌస్ వద్ద డబుల్ బెడ్‌రూమ్‌లు నిర్మాణాలు జరుగుతన్నా ఎప్పటికి పూర్తి అవుతాయో చెప్పే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్ మంగళ బస్తీలో డబుల్‌బెడ్ రూమ్‌లు పూర్తి కాకపోవడంతో పేదప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో మంచి పోలీస్ అధికారులు ఉన్నా శాంతిభద్రతలు అరికట్టలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బైంసాలో మత ఘర్ణన సంఘటనలు జరిగినప్పుడు రెండు రోజులు బంద్ జరగడం శాంతిభద్రలు విఫలం చేందాయని చెప్పడానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేశాక ఉద్యోగుల భర్తీని చేయకపోవడంతో పాలన కుంటుపడుతోందన్నారు. కేసీఆర్ పాలన అంతా పత్రికల్లో తప్పా వాస్తవంగా కన్పించడం లేదన్నారు. ప్రభుత్వ తక్షణం ఉద్యోగ నియామకాలు చెపట్టాలని ఆయన కేసీఆర్‌కు సూచించారు.