తెలంగాణ

యువతకు సరైన శిక్షణతో ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: యువతకు సరైన శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఏం కల్వకంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మాణంపై చర్చ సందర్భంగా తెలంగాణ శాసన మండలిలో శనివారం సాయంత్రం ప్రసంగించారు. కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి తెలంగాణకు ఉందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మభ్యపెట్టే పనులు చేయవద్దని వపక్షాలకు ఆయన హితవు పలికారు. డిఫెన్స్, రైల్వేస్, బ్యాంకింగ్ వంటి రంగాల్లోకి తెలంగాణ యువత వెళ్లడం లేదని, ఏ రంగంలో అవకాశాలు ఉన్నాయో యువతకు తెలియజేస్తామని చెప్పారు. యువతకు సరైన శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అందుకు గాను ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఏస్టీ స్టడి సెంటర్‌లలో తగిన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు లక్ష ఉద్యోగాలు ఇచ్చామని వాటిలో పోలీస్ శాఖలో 25వేల మందిని భర్తి చేయడం జరిగిందన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌లో దాదాపు 7లక్షల మంది పనిచేస్తున్నారని, హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించి లక్షల మంది బతుకుతున్నారని చెప్పారు. ఈ ఆర్ధిక సంవత్సరం నుంచి 57 ఏళ్లకే పింఛను ఇస్తామని ప్రకటించి, సీఎం మండలిలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పారు. రైతు వేదికల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని సూచించాము, రైతులు సంఘటితమైతే అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. 12,751 గ్రామపంచాయితీలకు ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలు ఇచ్చాం, వీటిని సద్వినియోగం చేసుకుని పచ్చదనాన్ని పరిరక్షించాలని సీఎం కోరారు. రాష్ట్రంలో జరిగిన ‘దిశ’ ఘటన చాలా బాధాకరం, మహిళలకు షీటీమ్స్ రక్షణ కల్పిస్తున్నాయి. అటవీ భూములు పోయాయి, ఉన్న చెట్లు నిరికేశారు. గతంలో ఉన్న చెట్లు నరికేశారే తప్ప కొత్తవి నాటలేదు. పర్యావరణం కోసం ఈ ఏడాది రూ.2,180 కోట్లు ఖర్చుపెట్టనున్నట్లు తెలిపారు. కంటి వెలుగు పథకం కింద 1.5కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కోసం మందులు, మాస్క్‌లు అవసరం లేదని, తెలంగాణలో కరోనా వైరస్ లేదు, రాదని చేపుతూ ప్రజలను అనవసరంగా భయా బ్రాంతులకు గురిచేయవద్దని సీఎం కోరారు. సీఎం ప్రసంగం అనంతరం సభ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అమోదం తెలిపి, సభను ఆధివారం ఉదయం 11.30 వరకు వాయిదా వేశారు.