తెలంగాణ

నరేంద్ర మోదీ నిర్ణయాలతో ఖరీదైన మందులూ అందుబాటు ధరలకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఖరీదైన మందులు సైతం సామాన్యుడికి అందుబాటు ధరలకే లభిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ఒకపుడు హార్ట్ స్టెంట్స్, నీ ఇంప్లాంట్స్, డయాలసిస్ వంటి చికిత్సల ఖర్చును చూసి సంపన్నులు సైతం భయపడే వారని ఇపుడు సామాన్యులకు కూడా అవి అందుబాటులోకి వచ్చాయని అన్నారు. జన ఔషధి దివాస్ పురస్కరించుకుని నిమ్స్ వద్ద ఉన్న జనఔషధి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ కే లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి సందేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, ఛాయాదేవి, ఎన్‌వీ సుభాష్, బి శ్యాంసుందర్ గౌడ్‌తో పాటు మెడికల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనేదే మోదీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సీఎం కేసీఆర్ రాజకీయ కారణాలతో ఆ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకుండా ఇక్కడి ప్రజలను వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య రంగంపై కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. జన ఔషధి కేంద్రాలు వచ్చాక మందుల రేట్లు భారీగా తగ్గాయని చెప్పారు. బహిరంగ మార్కెట్ కంటే 90 శాతం వరకూ తక్కువ ధరకే జన ఔషధి కేంద్రాల్లో మందులు దొరుకుతున్నాయని అన్నారు. తెలంగాణలో 122 జన ఔషధి కేంద్రాలు సేవలు అందిస్తున్నాయని దేశవ్యాప్తంగా 6200 కేంద్రాలున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మరో 200 జన ఔషధి కేంద్రాల అవసరం ఉందని, వనపర్తి జిల్లాలో ఒక్కటీ లేదని పేర్కొన్నారు.