తెలంగాణ

లక్ష ఉద్యోగాల మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాట ఎంతవరకు నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగాలు, నియామకాల విషయంలో సీఎం చొరవ చూపడంలేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం శాసన మండలి సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి దిశ, దశ చూపించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్న విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి చొరవ చూపకపోవడంతో ఆయా వర్గాల్లో గందరగోళం నెలకొందన్నారు. రాష్ట్రంలో పాలన కోసం వికేంద్రీకరణ తీసుకువచ్చి 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చిన అంశాన్ని తాను సమర్థిస్తున్నానని,
అయితే ఆయా జిల్లాల్లో ఉద్యోగుల భర్తీలో కనీసం ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని ఆయన నిదీశారు. ఉన్నవాళ్లతో పని చేయిస్తూ, పనిభారాన్ని పెంచారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయడంలో సీఎం జాప్యం చేయడం సబబు కాదన్నారు. తక్షణం ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటేనే అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంచడాన్ని జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణ పరిస్థితులు తీసుకువచ్చారన్నారు. తెలంగాణలో ఉద్యోగుల పీఆర్‌సీ కోసం వచ్చే డిసెంబర్ నాటికి వాయిదా వేయడం సమంజసం కాదన్నారు. గత 25 నెలుగా పీఆర్‌సీని ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని జీవన్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశాల్లోనే ఉద్యోగుల మధ్యంతర భృతిని అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల నియామకం కోసం అర్హులైన విద్యావంతులు కొలువుల కోసం ఎదురుచూస్తున్నారని, వీరికి తక్షణం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. సామాజిక న్యాయం కోసం గిరిజనులతో పాటు ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. కేంద్రం తీసుకువచ్చిన 10 శాతం అగ్రకులాల్లో వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల భర్తీ జరగలేదన్నారు. రైతుబంధు పథకం అమలులో నిబంధనలు తికమకపెడుతున్నాయని, దీంతో వ్యవసాయ అధికారుల్లో సైతం గందరగోళం నెలకొందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుబంధు పథకంలో నిబంధనలు తెలియజేస్తూ జీవో జారీ చేయాలన్నారు. రైతుకు 5 ఎకరాలు, లేదా 10 ఎకరాలకు మించకూడదా అన్న నిబంధనలు చెప్పాలన్నారు. సహకార సొసైటీల్లో రైతు అప్పులు తీసుకుంటే 7 శాతం వడ్డీ వసూలు చేస్తారని, అయితే అందులో 4 శాతం కేంద్రం, 3 శాతం రాష్ట్రం భరించాలని నిబంధన ఉంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వాల నుంచి వడ్డీ మాఫీ లభించకపోవడంతో అప్పులపాలు కావాల్సి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహా తెలివైనవారని, ఆయన ఏది చెప్పినా జనరంజకంగా ఉంటుందని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పాల్సిందిపోయి రన్నింగ్ కామెంట్, సెటైర్లు వేయడం మంచిది కాదన్నారు. జీవన్‌రెడ్డి అసంబద్ధమైన విమర్శలు చేయడాన్ని మంత్రి పువ్వాడ అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా జైళ్లలో ఏడేళ్లపాటు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని కేంద్రం సూచనకు అనుగుణంగా కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని, దీంతో వందలాది మంది ఖైదీలు విడుదల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన సూచించారు.

*చిత్రం... కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి