తెలంగాణ

పట్టణ ప్రగతిని అమలు చేసిన మున్సిపాలిటీలకే నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఫిబ్రవరి 26: రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికోసం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలుచేసిన మున్సిపాలిటీలకే నిధులు ఇవ్వనున్నట్టు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. పట్టణ ప్రగతి పురోగతిని తెలుసుకునేందుకు చేపట్టిన పర్యటనలో భాగంగా భువనగిరి మున్సిపాలిటీని బుధవారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పాలకవర్గం, అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాలలో పారిశుద్ధ్యం, నీటిసరఫరా, విద్యుత్, హరితప్రణాళికలను పక్కాగా అమలుచేసి పట్టణాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంచేసి ప్రతిపాదనలు పంపాలన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వార్డుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని, ప్రతిపక్షాలు విజయం సాధించిన వార్డులకు నిధుల మంజూరులో వివక్షత ఉండబోదన్నారు. జిల్లాల వారీగా మున్సిపల్ పాలకవర్గాలకు మున్సిపల్ చట్టం, అభివృద్ధిపనులకు నిధుల కేటాయింపులో శిక్షణ శిబిరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. 2017 సంవత్సరం వరకే ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేయడం జరుగుతుందని ఆపై గడువు పొడిగించడం కుదరదన్నారు. గడువు పెంచితే అక్రమ వెంచర్లను ప్రోత్సహించిచనట్టవుతుందని ఆయన తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్లశేఖర్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎనబోయిన అంజనేయులు, కమిషనర్ నాగిరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
*చిత్రం... భువనగిరి పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులు, పాలకవర్గంతో సమీక్షిస్తున్న మంత్రి కేటీఆర్