తెలంగాణ

సాంకేతిక విద్యకు సరికొత్త రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: వేలాది కాలేజీలు, లక్షలాది మందికి డిగ్రీలు చేతికి ఇస్తున్నామనే క్రెడిట్ కంటే ఎంత మందికి ఉపాధి కల్పించగలుగుతున్నామో, మిగిలిన వారికి ఎందుకు ఉపాధి కల్పించలేకపోతున్నామో అందరూ ఆలోచించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా రాష్ట్రంలో సాంకేతిక విద్యకు సరికొత్త రూపాన్ని ఇచ్చేందుకు గత కొద్ది నెలలుగా ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. పారిశ్రామిక సంఘాలు, సంస్థలతో ఒక వైపు, విద్యావేత్తలు, నిపుణులతో మరో వైపు సంభాషణలు కొనసాగిస్తోంది. రాష్ట్రంలో అవసరానికి మించి జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, బిఈడీ కాలేజీలున్నాయి. వాటిలో ప్రతి ఏటా 45 శాతం నుండి 65 శాతం వరకే సీట్లు భర్తీ అవుతున్నాయి. మిగిలిన సీట్లు ఖాళీకా ఉండిపోతున్నాయి. కొన్ని కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు సీట్లనో, బ్రాంచిలనో సరెండర్ చేస్తున్నాయి. కొన్ని బ్రాంచిలను తాము నిర్వహించలేమని చెబుతున్నాయి. సున్నా అడ్మిషన్లున్న కాలేజీలు తాము కాలేజీలను నిర్వహించలేమని గుర్తింపు రద్దు చేసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న కాలేజీలు తమ వద్ద చదువుతున్న విద్యార్థులను వేరే కాలేజీలకు బదిలీ చేయాలని,తాము కాలేజీలను మూసుకుంటామని చెబుతున్నాయి. ఇదంతా పెద్ద గందరగోళంగా తయారవుతోంది. గట్టిగా డిమండ్ ఉన్న కాలేజీల సంఖ్య పది శాతం దాటడం లేదు. వాటిలో మాత్రం నూరు శాతం సీట్లు భర్తీ అవుతున్నాయి. ఫీజులు ఎక్కువగా ఉన్నా విద్యార్థులు వాటిపైనే మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిగా చెల్లించకపోయినా విద్యార్థులు వాటిలోనే చేరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనో, శివారు ప్రాంతాల్లోనో ఉన్న కాలేజీల ముఖం ఎవరూ చూడటం లేదు. నాశిరకం సదుపాయాలు, ఫ్యాకల్టీ సరిపడా లేకున్నా, బోధనేతర సిబ్బంది, సహాయ సిబ్బంది, ఇతర విద్యాత్మక సదుపాయాలు లేకపోయినా కొంత మంది కాలేజీలు నడుపుతున్నారు. అయితే వాటి సంగతి తెలిసి ఎవరూ చేరడం లేదు. అలాంటి కాలేజీలు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ మీద ఆధారపడుతున్నాయి. ప్రతి ఏడాది రీయింబర్స్‌మెంట్ అంశం వివాదాస్పదం అవుతోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కాలేజీలో సదుపాయాలు పెంచాలని, పర్యవేక్షణ మరింత కఠినతరం చేయాలని యోచిస్తోంది. అటెండెన్స్ కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. బోధన సిబ్బందికి సైతం బయోమెట్రిక్ అమలుచేస్తోంది. అదే విధంగా వారి ఆధార్ విశిష్ట సంఖ్యతో డాటాను తయారు చేసింది. ఒకే వ్యక్తి రెండు మూడు కాలేజీల్లో పనిచేయకుండా నియంత్రించింది. ఇంకోవైపు డిగ్రీ చేతికి వచ్చిందంటే చాలు వారికి తప్పనిసరి ఉద్యోగం లభించేలా సదుపాయాలు పెంచేందుకు కాలేజీల్లో ఉండగానే విద్యార్థుల నైపుణ్యాన్ని, వికాసాన్ని పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మరో మారు బుధవారం నాడు ఉన్నత విద్యామండలి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్, కమిషనర్ నవీన్ మిట్టల్, ఐటీసీ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్, సియాంట్ టెక్నాలజీస్ ఎండీ బీవీ మోహన్‌రెడ్డి, టీసీఎస్ రీజనల్ హెడ్ వీ రాజన్న ఇతర ఇండస్ట్రీ ప్రతినిధులు పాల్గొంటారు.