తెలంగాణ

ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికకు అదనంగా మరో ఎక్స్‌అఫీషియో సభ్యుడి ఓటును అనుమతించి ఎన్నికల సంఘం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఏఐసీసీ ప్రతినిధి నిరంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ విషయమై జోక్యం చేసుకుని తప్పును సరిదిద్దుతూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఎన్నికల అక్రమాలకు పరాకాష్ట అన్నారు. ఈనెల 25వ తేదీ లోపు ఎక్స్ అఫీషియో సభ్యుల నమోదు చేయించాలని తనకే స్వయంగా మున్సిపల్ శాఖ కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ చెప్పారన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై కొంత జరిగిన తర్వాత కొత్త సభ్యులను నమోదు చేయడం తగదన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ నేరేడు చర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వ అధికారులు అధికార పార్టీ చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసు ప్రకారం సభ్యుల ఓటు హక్కు ఉండాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేసిన తీరు సిగ్గు చేటుగా ఉందన్నారు.