తెలంగాణ

ప్రచారం ముగిసింది.. పోలింగ్ మిగిలింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సి‘పోల్స్’కు సంబంధించి ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఇక పోలింగ్ మాత్రమే మిగిలింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మున్సిపల్ కార్పొరేషన్లలో 325 వార్డులకు గాను ఇప్పటికే మూడు వార్డుల్లో కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్ని మున్సిపాలిటీల్లో 2,727 వార్డులకు గాను ఇప్పటికే 80 వార్డుల్లో ఏకగ్రీవంగా కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. మిగతా స్థానాలకు ఎన్నికలు జరుగన్నాయి. ఇదిలావుండగా, గత వారం, పది రోజుల నుండి టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం తదితర పార్టీలన్నీ పోటీపడి ప్రచారం చేశాయి. అభ్యర్థులు ప్రధానంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయ పార్టీలు బహిరంగ సమావేశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో వినూత్న విధానాన్ని అమలు చేసింది. బయట నుండి వచ్చే స్టార్ క్యాంపెయినర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన మంత్రివర్గంలోని మంత్రులకు కొన్ని జిల్లాలను కేటాయించారు. ఈ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో మకాం వేసి తమ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రచారాన్ని కొనసాగించారు. పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు రాత్రనక, పగలనక ప్రచారంలో పాల్గొన్నారు. అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బాధ్యతను తీసుకుని ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపల్ వార్డుల పరిధి చిన్నగా ఉండడం వల్ల ప్రచారం కూడా సులువైంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరఫున రాష్టస్థ్రాయి నేతలు కొన్ని జిల్లాలకు వెళ్లి సమావేశాల్లో, రోడ్‌షోలలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ తమ ప్రచారంలో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రధానంగా వాడుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలకు ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే రాజకీయ పార్టీలతో పాటు, స్వతంత్రులు ఇతర అభ్యర్థులు రోజూ పాదయాత్రల ద్వారా తమ తమ పరిధిలో ప్రచారం చేశారు. సగం స్థానాలు మహిళలకే కేటాయించడం వల్ల మహిళలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ఇళ్లల్లో ఉండే మహిళలకు బొట్టుపెట్టి ఓట్లు వేయండంటూ అడగడం ఎక్కువగా కనిపించింది. ప్రచారం కోసం బ్యానర్లు చాలా తక్కువగా వాడారు. కరపత్రాలు ఎక్కువగా వాడారు. ప్రచారం కోసం చిన్న వాల్‌పోస్టర్లను కూడా వాడారు. అయితే ఇళ్లపై
ఇతర భవనాలపై ఎన్నికల ప్రచారం రాతలు ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున 2,972 మంది, కాంగ్రెస్ తరఫున 2,616 మంది, బీజేపీ తరఫున 2,313 మంది పోటీలో ఉన్నారు. ఎంఐఎం తరఫున 276 మంది, సీపీఐ తరఫున 177 మంది, సీపీఎం తరఫున 166 మంది, టీడీపీ నుండి 347 మంది రంగంలో ఉన్నారు. రాష్టస్థ్రాయి పార్టీలు, స్వతంత్రులతో సహా మొత్తం 12,898 మంది రంగంలో ఉన్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు
పోలింగ్ నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగాలకు సూచనలు, సలహాలు ఇస్తూనే ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి. నాగిరెడ్డి ఎన్నికల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు ఈ ఎన్నికల సమయంలో వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది.
కార్పొరేషన్లలో 1,438 పోలింగ్ కేంద్రాలను, మున్సిపాలిటీల్లో 6,325 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లోని క్యూలైన్లలో నిలబడ్డ ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు. ఐదు గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంత సమయమైనా సిబ్బంది పనిచేస్తారు. ఐదు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల్లోకి ఎవరినీ రానివ్వరు. పోలింగ్ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. బుధవారం పోలింగ్ కోసం ఇప్పటికే సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చారు. మంగళవారం ఉదయం నుండే ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాల నుండి పోలింగ్ మెటీరియల్ తీసుకుంటారు. బ్యాలెట్ పేపర్లను తెలుపురంగులో ముద్రించారు. జిల్లా కలెక్టర్లే బ్యాలెట్ పత్రాల ముద్రణ పనిని స్వయంగా పర్యవేక్షించారు. బ్యాలెట్ పత్రాల్లో ఎలాంటి తప్పులు జరగకుండా ఒకటికి రెండుసార్లు పరిశీలించారు. ఎన్నికల్లో డ్యూటీపడ్డ సిబ్బంది మంగళవారం ఉదయమే పోల్ మెటీరియల్ తీసుకునేందుకు తమకు కేటాయించిన కేంద్రాలకు వెళతారు. మంగళవారం సాయంత్రం వరకే ఈ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ తీసుకుని వెళతారు. మంగళవారం రాత్రికే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసుకుంటారు. రిటర్నింగ్ ఆఫీసర్లపై ఎక్కువ బాధ్యత ఉంది. బుధవారం తెల్లవారుజామునే సిబ్బంది పోలింగ్ కోసం ఏజంట్ల సమక్షంలో ఏర్పాట్లు చేస్తారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన పరిశీలకులు తమ తమ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఒకవైపు అభ్యర్థుల ప్రచార విధానాన్ని పరిశీలిస్తూనే, మరోవైపు ప్రచారానికి జరిగే వ్యయంపై కూడా అంచనా వేశారు. పోలింగ్ సందర్భంగా పోలీసు శాఖ బందోబస్తు విస్తృతంగా ఏర్పాటు చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది.
సెలవు
ఇదిలావుండగా, ఎన్నికలు జరిగే పట్టణాల్లో ప్రభుత్వ సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించేందుకు వీలు కల్పించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవు ఉంటుంది. ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.