తెలంగాణ

మెరుగైన సేవలకు సరిహద్దుల నిర్దారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జనవరి 16: ఆధునిక శాస్త్ర, సాంకేతికతను వినియోగించడంద్వారా నేరాలను తగ్గింపు, శాంతి, భద్రతల పరిరక్షణ కోసం మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ స్టేట్ రిమోట్‌సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (ట్రాక్) కార్యాలయంలో గురువారం ట్రాక్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీనివాస్ రెడ్డి, ట్రాక్ సైంటిఫిక్ ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల సరిహద్దుల నిర్దారణ, పోలీస్ శాఖ భూములను గుర్తించి పరిరక్షించుకోవడం కోసం స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అధికారులకు డీజీపీ సూచించారు. మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ రూపొందించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ స్టేట్ రిమోట్‌సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందేందుకు ఎం.ఓ.యూ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది ఐటీ రిమోట్ ఆధారిత పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మెరుగైన పౌర సమాజాన్ని రూపొందించాలని కోరారు. రిమోట్ సెన్సింగ్ ద్వారా రాష్ట్రంలో ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాల మ్యాపింగ్, రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాలను, కీలక రోడ్డు మలుపులతో కూడిన సమగ్ర సమాచారాన్ని మ్యాపింగ్ ట్రాక్ సహాయంతో చేపట్టనున్నామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల సరిహద్దులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేసి పౌరులకు తెలిసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలను గుర్తించి వాటిని కూడా జియో మ్యాపింగ్ చేసి హైదరాబాద్ పోలీస్ ప్రధాన కార్యలయాం, జిల్లా పోలీస్ కార్యాలయాల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. పోలీస్ శాఖకు చెందిన ఖాళీ స్థలాలు, పోలీస్ స్టేషన్లు, కార్యాలయ భవనాలు, ఇతర శాశ్వత ఆస్తులన్నిటినీ జియో ఫెన్సింగ్ ద్వారా మ్యాపింగ్ చేసి వాటిని పరిరక్షించాలని సూచించారు. సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ జితేందర్, సాయుధ బెటాలియన్ అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ పాల్గొన్నారు. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్‌తో ఎం.ఓ.యూ కుదుర్చుకోడానికి విధివిదానాలను రూపొందించాలని ఐటీ విభాగాన్ని డీజీపీ ఆదేశించారు. రాష్ట్రంలో 92 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారులు ఉన్నాయని, 25వేల కిలోమీటర్ల రహదారుల వెంట ఆవాసాలు ఉన్నాయని, రహదారుల వ్యవస్థ మొత్తాన్ని రిమోట్ సెన్సింగ్ చేయడం జరిగిందని ట్రాక్ అడిషనల్ డీజీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
'చిత్రం... ట్రాక్ సైంటిఫిక్ ఇంజనీర్లతో తెలంగాణ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి