తెలంగాణ

సీఏఏ ఉపసంహరణ అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని జమ్మూ కాశ్మీర్ సహా దేశవ్యాప్తంగా ఇది అమలులో ఉందని కేంద్ర అల్పసంఖ్యాక వర్గాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఆదివారం ఇక్కడ నెక్లెస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన హస్తకళల ప్రదర్శన హాత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఏకమై పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పపట్టిక, జాతీయ జనాభా పట్టికపై ప్రజలను తప్పుదోవ బట్టిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని ఒక వర్గంలో భయాందోళనలు కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ చట్టం వల్ల ముస్లింలకు నష్టం కలిగే అవకాశం లేదన్నారు. ప్రతిపక్షాలు చెప్పినట్లుగా తమ రాష్ట్రాల్లో సీఏఏకు విరుద్ధంగా చట్టాలను చేస్తామని కొంతరు ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సీఏఏ అమలు వల్ల వారి పౌరసత్వానికి ఎలాంటి విఘాతం కలగదన్నారు. దేశ వ్యాప్తంగా తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా ఆదాయం హస్తకళల వృత్తుల ప్రజల ఆదాయం మెరుగుపడుతుందన్నారు. హస్తకళాకారుల సర్టిఫైడ్ బ్రాండ్ రూపొందుతోందన్నారు. ఈ నెల 19వరకు హైదరాబాద్‌లో ఈ ప్రదర్శన కొనసాగుతుంది.
'చిత్రం...హైదరాబాద్‌లో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీతో కలిసి డోలు వాయస్తున్న కేంద్ర మంత్రి నఖ్వీ