తెలంగాణ

ఊరికి పోదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జనవరి 12: పండుగ జరుపుకోవడం కోసం పల్లెలకు వెళ్లే ప్రయాణికులతో సికిందరాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టాండ్లు కిక్కిరిసిపోయాయి. సోమవారం నుంచి తెలంగాణలోని అనేక విద్యాసంస్థలు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో తమతమ సొంత గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం కోసం పిల్లాపాపలతో సకుటుంబ సపరివారంతో శనివారం ఉదయం నుంచే రైల్వే స్టేషన్‌లకు, బస్టాండ్‌కు చేరుకున్నారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, రాయలసీమ, రాజమండ్రి, శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోల్ ప్రాంతాలకు చెందిన ప్రజలు సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకొని రైళ్లలో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎక్కువగా వస్తుండగా, తెలంగాణ జిల్లాలైన మెదక్, సిద్దిపేట్, నిజామాబాద్, బోదన్, కామారెడ్డి ప్రాంతాలకు చెందిన ప్రజలు జూబ్లీ బస్సుస్టాండుకు చేరుకొని తమ తమ స్వస్థలాలకు చేరుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రైళ్లలో సీట్ల సంపాదించడం కోసం ప్రయాణికులు సాహసమే చేయాల్సి వస్తోంది. పండుగ రద్దీని దృష్ఠిలో పెట్టుకొని రైల్వే అధికారులు ముందస్తుగా 236 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అవి కూడా సరిపోకపోవడంతో లింగంపల్లి, సికిందరాబాద్ నుంచి కాకినాడకు రిజర్వేషన్ లేని మరో 15 ప్రత్యేక రైళ్లను జనవరి 11, 12, 13 తేదీల్లో ప్రవేశపెట్టినట్లు సీపీఆర్‌వో సీహెచ్. రాకేష్ శనివారం ప్రకటించారు. ప్రయాణికుల రద్దీకి ఈ రైళ్లు కూడా ఏ మాత్రం సరిపోవడం లేదు. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు కొంత సులభంగా రైళ్లలోకి ఎక్కుతుండగా ఎటువంటి రిజర్వేషన్ చేసుకోని ప్రయాణికులు టికెట్ల కోసం ఆ తరువాత బెర్తులకోసం అనేక అవస్థలు పడుతున్నారు. పిల్లా పాపలు, వృద్దులు, లగేజీలతో రైలు ఎక్కాలంటే చెప్పలేనంత ఇబ్బందులకు గురౌతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ బోగీల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు మాహిళలు కూడా సీట్లకోసం కిటికిలలోంచి రైళ్లలోకి ప్రేవేశించడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. ఇది గమనించిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తొక్కిసలాటలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి బోగివద్ద దగ్గరుండి మరీ క్రమ పద్ధతిలో ఎక్కేవిధంగా కంట్రోల్ చేస్తున్నారు. రైల్వే ఎస్పీ అనురాధ, డీఎస్పీలు రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్‌ల ఆదేశాల మేరకు మరొక కన్ను జేబుదొంగలు, గొలుసు దొంగలు, గంజాయి ముఠాలపై వేశారు. గట్టి బందోబస్తును ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. నగరం నుంచి గ్రామాలకు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యం కోసం నగరం నుంచి నాలుగు వేల ప్రత్యేక బస్సులను వేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్‌తో పోల్చుకుంటే జూబ్లీ బస్డాండులో ప్రయాణికులు రద్దీ తక్కువగానే ఉన్నదని చెప్పుకోవాలి. నగరంలోని ప్రజలు ఊళ్లకు వెళ్లడంతో సికిందరాబాద్‌లోని అనేక ప్రధాన రహదారులు ఎక్కువగా ట్రాఫిక్ లేకుండా ఆదివారం మధ్యాహ్నమే నిర్మానుష్యంగా మారాయి.
'చిత్రం...సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్న సికిందరాబాద్ రైల్వే స్టేషన్