తెలంగాణ

‘పోతిరెడ్డిపాడు’పై మాట్లాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్థాయిని పెంచడం వల్ల తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని, ఈ విషయమై ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలని కాంగ్రెస్ సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేసింది. ఆదివారం ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, బెల్లయ్య నాయక్‌లు విలేఖర్లతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన ఇక్కడ కేసీఆర్, జగన్ భేటీ ఉందని, ఈ సమావేశంలో పోతిరెడ్డిపాడుపై చర్చించాలన్నారు. మొహమాటం లేకుండా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ స్థాయి పెంచడాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు. కేసీఆర్ ఈ విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. లేకపోతే కరవు ప్రాంతాలైన దక్షిణ తెలంణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పుడు 44వేల నుంచి 88 వేల క్యూసెక్కుల నీటిన తరలించేందుకు కుట్ర మొదలైందన్నారు. అసలు పోతిరెడ్డి పాటు హెడ్‌రెగ్యులేటర్ స్టేటస్ ఏమిటో తెలియచేయాలన్నారు. ఈ విషయమై కేసీఆర్ ప్రకటన చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దగా చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ రెగ్యులేటర్‌ను 15 టీఎంసీ నీటిని తెలుగు గంగకు తరలించే ఉద్దేశ్యంతో నిర్మించారన్నారు.గతంలో 11 వేల క్యూసెక్కుల నుంచి 44 క్యూసెక్కుల వరకు రెగ్యులేటర్ స్థాయిని పెంచారన్నారు. కాగా దివంత కాంగ్రెస్ నేత జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నివాళులు అర్పించారు. పార్టీకి చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు.