తెలంగాణ

జీడీపీ పెరగాలంటే ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: వచ్చే ఏడాది జీడీపీ ఐదు శాతం వృద్ధి సాధిస్తుందన్న ముందస్తు అంచనాలతో ఆర్థిక వ్యవస్థలోకి మూలధనాన్ని క్రమపద్ధతిలో తెచ్చేందుకు పలు చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని ఫిక్కీ వాణిజ్య సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి కేంద్రాన్ని కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాకు ఊహించిన విధంగానే ఉందన్నారు. సంవత్సం మొదటి అర్థ భాగంలో వృద్ధి మితంగా ఉంటుందని, ఆ తర్వాత కొంత ఊపందుకుంటుందన్నారు. వాస్తవానికి మెరుగుదలను సూచించే సంకేతాలు ఉన్నాయన్నారు. రాబోయే సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలోకి రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.2లక్షల కోట్ల వరకు చొప్పించేందుకు ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించాలని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే ప్రస్తుత దశలో డిమాండ్ పెంచడానికి, పెట్టుబడులను ప్రేరేపించేందుకు ఇటువంటి ఆర్థిక విస్తరణ చర్యలు చాలా అవసరమన్నారు. ఆర్థిక వ్యవస్థ స్వభావం చక్రం లాగా ఒక దాని తర్వాత ఒకటి పునరావృతం అవుతుంటుందన్నారు. ఆర్థిక లోటు గురించి ఆందోళన చెందడం కంటే, తిరిగి శక్తి ఇచ్చేందుకు ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ మూలధనాన్ని ప్రవేశపెట్టాలన్నారు. చౌకగా రుణాలను ఇవ్వడమే కాకుండా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు ఎక్కువ చేయాలన్నారు. పీఎం కిసాన్ కింద ఆదాయ మద్దతు పరిమాణం, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం విస్తరణ ద్వారా దీనిని సాధించవచ్చన్నారు. నిర్మాణం, వౌలిక సదుపాయాలు, ఎగుమతులను పెంచేందుకు తగిన చర్యలు అవసరమన్నారు. ఆర్ట్ఫిషీయల్, ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన ఆర్థిక వ్యవస్థలపై దృష్టి పెట్టాలన్నారు. సైన్స్, ఇతర ఆవిష్కరణలపై అదనంగా దృష్టి పెట్టడం ద్వారా సమాంతర వృద్ధిని జోడించేందుకు ఇది చాలా ముఖ్యమన్నారు.