తెలంగాణ

డిటిసి కార్యాలయంపై ఎసిబి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 4: జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్(డిటిసి) కార్యాలయంపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. నిజామాబాద్ డిఎస్పీ నరేందర్‌రెడ్డి నేతృత్వంలో నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన సిబ్బంది పక్కా ప్రణాళికతో జరిపిన ఈ దాడి సందర్భంగా ఆర్టీఎ కార్యాలయంలో వేళ్లూనుకుపోయిన ప్రైవేట్ ఏజెంట్ల దందా మరోసారి తెరపైకి వచ్చింది.
ఆర్టీఎ కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవస్థను ప్రభుత్వం గత చాలాకాలం క్రితమే రద్దు చేసినప్పటికీ, అనేక మంది ప్రైవేట్ ఏజెంట్లుగా చెలామణి అవుతున్నారు. వీరి ఆగడాలు ఇటీవలి కాలంలో మరింతగా శృతి మించాయని, ఆర్టీఎ కార్యాలయంలో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందనే ఫిర్యాదులు అందడంతో ఎసిబి అధికారులు ఆకస్మిక దాడి చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఎ కార్యాలయంలో 24మంది ప్రైవేట్ ఏజెంట్లు పట్టుబడగా, వారి వద్ద నుండి 50,910రూపాయల నగదు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని ఎసిబి నిజామాబాద్ డిఎస్పీ నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆర్టీఎ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో రికార్డులను తనిఖీ చేయగా, ప్రభుత్వ ఖజానాలో ఉండాల్సిన నగదు కంటే తక్కువ నిల్వలు ఉన్నట్టు ఎసిబి అధికారులు గుర్తించారు. అంటే సదరు సొమ్ము ప్రైవేట్ ఏజెంట్లు తమ వద్దే అట్టి పెట్టుకున్నట్టు సోదాల సందర్భంగా వెల్లడైంది. కార్యాలయంలోని రికార్డులను సీజ్ చేసి క్షుణ్ణంగా పరిశీలన జరుపుతున్నామని, ఆర్టీఎ ఆఫీసుతో ఎంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంబంధం ఉంది, వారికి కార్యాలయంలోని ఏయే విభాగాల అధికారులు సహకరిస్తున్నారు, దీని వెనుక గల ఆంతర్యమేమిటి తదితర వాటి గురించి విచారణ జరుపుతున్నామని, విచారణ అనంతరం బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామని, నివేదికను రూపొందించి సంబంధిత ఉన్నతాధికారులకు సమర్పిస్తామని డిఎస్పీ పేర్కొన్నారు. కాగా, ఏమాత్రం ఊహించని రీతిలో ఎసిబి అధికారులు ఒక్కసారిగా దాడి చేయడం ఆర్టీఎ ఏజెంట్లలో కలకలం సృష్టించింది. ఆదివారం సెలవు దినం కావడంతో తమ వద్ద ఉన్న పెండింగ్ అప్లికేషన్లను సైతం చేతబట్టుకుని సోమవారం పెద్ద సంఖ్యలో ఏజెంట్లు ఆర్టీఎ కార్యాలయానికి వచ్చారు. అదే సమయంలో ఎసిబి దాడి జరగడంతో కార్యాలయం లోపల ఉన్న 24మంది ఏజెంట్లు పట్టుబడగా, బయట ఉన్న మరికొందరు తప్పించుకుని ఆర్టీఎ ఆఫీసు పరిసరాల నుండి పరుగు లంకించుకున్నారు. ఎసిబి దాడితో ఉలికిపాటుకు లోనైన ప్రైవేట్ ఏజెంట్లందరూ తమ కార్యాలయాలకు ఉన్నపళంగా తాళాలు వేసుకున్నారు. ఎసిబి అధికారులు ఎక్కడ తమ అడ్డాలపై కూడా దాడులు నిర్వహిస్తారోననే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొత్తం మీద ఆర్టీఎ కార్యాలయ సిబ్బంది తోడ్పాటుతోనే ప్రైవేట్ ఏజెంట్లు రెచ్చిపోతున్నట్టు మరోమారు నిరూపితమైంది. ప్రైవేట్ ఏజెంట్లు అనధికారిక రవాణా శాఖ ఉద్యోగులుగా చెలామణి అవుతూ, ఆయా పనుల కోసం వచ్చే వారిని నిలువు దోపిడీకి పాల్పడుతున్న వైనం కళ్లకు కట్టినట్టు తేటతెల్లం అయ్యింది. ఏజెంట్లను సంప్రదించకుండా ఎవరైనా నేరుగా వెళ్తే ఆర్టీఎ అధికారులు సైతం ఏవో సాకులు చెబుతూ పనులు చేసి పెట్టకుండా దరఖాస్తుదారులను రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు ఇతర పనుల కోసం ఆర్టీఎ కార్యాలయానికి వచ్చే వారిని ముందుగానే ఏజెంట్లు సంప్రదిస్తూ నిర్ణీత రుసుము కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. అందులో ఆర్టీఎ కార్యాలయంలోని ఆయా విభాగాల ఉద్యోగులకు వాటాల రూపంలో ముడుపులు ముట్టజెబుతుండడంతో ఏజెంట్ల ద్వారా వచ్చే దరఖాస్తులకు సంబంధించిన పనులను క్షణాల్లో చేసి పెడుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం కాస్త ఎసిబి తాజా దాడితో మరోమారు బట్టబయలైంది.

కోర్టుకు హాజరైన
మండలి చైర్మన్ స్వామిగౌడ్
లీగల్ (కరీంనగర్), జనవరి 4: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారన్న అభియోగంపై శాసనమండలి చై ర్మన్ స్వామిగౌడ్ సోమవారం ఇక్కడి ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి జి.శ్రీనివాస్ ఎదుట హాజరయ్యారు. వివరాల్లోకి వెళ్తే..కరీంనగర్ ఎమ్మె ల్సీ స్థానానికి టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని తహశీల్దార్ భుజంగరావు ఫిర్యాదు మేరకు స్వామి గౌడ్‌పై కరీంనగర్ ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పోస్టర్లు అంటించడం, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిద్దాం, సమైక్యాంధ్ర అభ్యర్థులను పాతరేద్దాం అంటూ వివిధ నాయకుల ఫొటోలతో పోస్టర్లు అంటించడంతో పాటు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో సోమవారం కరీంనగర్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి జి.శ్రీనివాస్ ఎదుట హాజరయ్యారు. అనంతరం ఈ కేసును వచ్చే నెల 15కు వాయిదా వేశారు. స్వామిగౌడ్ వెంట న్యాయవాదులు బూడిద మల్లేశం, పి.వి.రాజ్‌కుమార్, వాల మహేందర్ రావు, కోలకాని భూమయ్య ఉన్నారు.

ఏసిబి వలలో ఇద్దరు
ఆర్టీఏ అధికారులు
రూ.8వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 4: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. తెలంగాణ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్న జె నరేందర్, జూనియర్ అసిస్టెంట్ టి మురళీ కెఎస్ ఆగ్రోటిక్ సంస్థ రూపొందించిన వరికోత యంత్రాల రిజిస్ట్రేషన్ అనుమతులకు సంబంధించి సర్క్యులర్ జారీ చేసేందుకు రూ. 8వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. వీరిని ఏసిబి డిఎస్పీ రవికుమార్ అరెస్టు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉంది.
23 కేసుల్లో ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డికి రిమాండ్
13 వరకు జుడీషియల్ కస్టడీ
లీగల్ (కరీంనగర్), జనవరి 4: కరీం నగర్ జిల్లాలో ఇటీవల సంచలనం సృష్టించిన కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రామవరం ప్రసాదరావు ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎఎస్‌ఐ మోహన్ రెడ్డిపై పోలీసులు 23 కేసుల్లో పిటి వారెంట్‌పై సోమవారం కరీంనగర్ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మాధవి ఎదుట హాజరుపర్చారు. అన్నలదాసు లక్ష్మినారాయణ, వీరమల్ల చంద్ర య్య, బండమీది వీరమ్మ, బండ రాజం, దొండి అనిత, బచ్చు నమఃశివాయలు కరీంనగర్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో, ఎం.డి.గోరిమా, మందపల్లి అంజలిలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో, కంకణాల వనిత, బీరెడ్డి కమలాకర్‌రెడ్డి, పూదరి కనుకయ్య రామడుగు పోలీస్ స్టేషన్‌లో, వీరమల్ల చంద్రయ్య, ముస్కు మహేందర్ రెడ్డి, జాప రత్నాకర్ రెడ్డి, రంగు ఈశ్వరాచారిలు ఎల్‌ఎండి పోలీస్ స్టేషన్‌లో, గసికంటి కుమార్, గువ్వల రాధాబాయి, అల్ల కొండాల్ రెడ్డి, పెంచాల ప్రభాకర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డితో పాటు తదితరులపై వీరంతా ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్ అధికారులు తీసుకొని కోర్టు అనుమతితో పిటి వారెంట్‌పై న్యాయస్థానంలో హాజరుపర్చారు. అనంతరం ఎఎస్‌ఐ మోహన్ రెడ్డిని ఈ నెల 13 వరకు జుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
టైరు పేలి
వాహనం పల్టీ
ఇద్దరు మృతి * ఐదుగురికి గాయాలు
వికారాబాద్, జనవరి 4: పూడూర్ మండలం చీలాపూర్ గ్రామ సమీంపలోని కేశవరెడ్డి పాఠశాల సమీపంలో ఫోర్చునర్ వాహనం పల్టీ సంఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకున్న చార్మినార్ ఎమ్మెల్యే ఖాద్రీపాష సోమవారం ఉదయం వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటనలో మృతిచెందిన చార్మినార్ ప్రాంతంలోని దర్గాకు చెందిన మహ్మద్ అలి మొహియొద్దీన్ ఖాద్రి(28), వౌలానా నరుూమొద్దీన్(27)లు మృతి చెందడంతో ఆయన ఆసుపత్రికి వచ్చారు. ఈసందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం చించోలిలో జరుగుతున్న మిలాల్-ఉన్-నబీ జల్సాకు వెళ్లి తిరిగి వస్తుండగా పూడూర్ మండలం పరిగి రోడ్డులో టైరు పేలి వాహనం పల్టీ కొట్టిందని, వాహనంలో ఎనిమిది మంది ఉండగా ఇద్దరు మృతి చెందారని, గాయపడిన ఆరుగురిని కేర్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. వాహనంలో ఉన్నవారంతా ఇస్లామి రిలీజియన్‌కు చెందిన స్కాలర్స్ అని పేర్కొన్నారు.

నేటినుంచి గ్రేటర్‌లో షర్మిల యాత్ర
వేడెక్కుతున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 4: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిలను గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో విస్తృతంగా పర్యటించాల్సిందిగా సూచించారు. అయితే గ్రేటర్ పరిథిలో పరామర్శ యాత్ర చేయడం ద్వారా పార్టీ తరఫున పోటీ చేసేందుకు ముందుకు వచ్చే వారి దరఖాస్తులను తీసుకుని, ఆ తర్వాత పరిశీలన చేసి ఎంపిక చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసే అంశాన్నీ ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇలాఉండగా 5వ తేదీ (మంగళవారం) నుంచి ఆమె మూడు రోజుల పాటు ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ మూడు రోజుల్లో ఆమె 18 కుటుంబాలను పరామర్శిస్తారని ఆ పార్టీ నాయకులు సురేష్‌రెడ్డి, శివకుమార్ తెలిపారు. మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో షర్మిల పరామర్శ యాత్ర నిర్వహిస్తారు. బుధవారం (6న) సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్.బి. నగర్, గురువారం (7న) ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఆమె పరామర్శ యాత్ర నిర్వహిస్తారు.
ఇలాఉండగా డివిజన్ల రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్ ఏ సమయంలోనైనా విడుదల కానున్నందున అన్ని పార్టీలూ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. పరస్పర విమర్శలు ఆరంభమయ్యాయి. దీంతో గ్రేటర్ పరిథిలో ఎన్నికల వాతావారణం వేడెక్కింది.