తెలంగాణ

కాళేశ్వరానికి 1,500 మెగావాట్ల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి నుంచి కాళేశ్వరం ఎత్తిపోతలకు అవసరమైన 1,500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు అంశంపై ఎన్‌టీపీసీతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. దీంతో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఎన్‌టీపీసీ సీఎండీతో చర్చించారు. గోవాలో సదరన్ రీజియన్ సమావేశంలో ఈ ఇద్దరు సీఎండీలు
భేటీ అయ్యారు. తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం 1,500 మెగావాట్లను సరఫరా చేయాలని సమావేశంలో ఎన్‌టీపీసీ సీఎండీ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ యూనిట్ ధర 3 రూపాయలకు లోబడి సరఫరా చేస్తామని ఎన్‌టీపీసీ హామీ ఇచ్చింది. తెలంగాణకు సోలార్ నుంచి ఉత్పత్తి చేసి చేసే విద్యుత్‌ను కొనుగోలు చేస్తారు. అభివృద్ధిలో శరవేగంగా ముందుకు దూసుకుపోతున్న తెలంగాణను అన్నివిధాలా ఆదుకుంటామని ఎన్‌టీపీసీ సీఎండీ పేర్కొన్నారు.