తెలంగాణ

రాష్ట్రమంతా హెల్త్ ప్రొఫైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల్లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపే విధంగా ఎక్స్‌రే తీయించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించారు. బుధవారం సిద్దిపేట జిల్లాలోని ములుగు, గజ్వేల్ పట్టణాల్లో రూ.295.02 కోట్లతో చేపట్టిన అటవీ శాఖ కళాశాల-పరిశోధన కేంద్రం, ఉద్యానవన విశ్వవిద్యాలయం, సమీకృత కూరగాయలు, మాంసం విక్రయ కేంద్రం, సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయం, మహతి ఆడిటోరియాలను సీఎం ప్రారంభించారు. రూ.121 కోట్లతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తల్లి, పిల్లల ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన చేసారు. అనంతరం మహతి ఆడిటోరియంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులను ఉద్దేశించి సీఎం నియోజకవర్గ అభివృద్ధిపై దిశా నిర్దేశం చేసారు. గ్రామాల్లో ఆయా రంగాల్లో పని చేస్తూ స్థిరపడిన వారిని పక్కన పెట్టి పని లేకుండా ఎవరెవరు ఖాళీగా ఉంటున్నారో వారిని గుర్తించాలని, వారికి అవసరమైన పనులు కల్పించి బతుకులకు బాటలు వేసే బాధ్యత నాయకులపై ఉందన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కథానాయకులుగా ఉంటే అన్ని సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఏదో చేసిపెట్టామని తమ బాధ్యత తీరిపోయిందనుకుంటే పొరపాటని, ప్రజాక్షేత్రంలో ఉండే నాయకుడు అవిశ్రాంతమైన సేవలు అందించాల్సి ఉంటుందని సూచించారు.
గజ్వేల్ ఎమ్మెల్యేగా తనకంటూ స్వార్థం ఉందని, అందుకే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కేసీఆర్ చెప్పారు. పైరవీలకు తావులేకుండా పార్టీలకు అతీతంగా పని చేద్దామన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతి ప్రజాప్రతినిధిని ఒక చోటకు చేర్చి నియోజకవర్గ సమస్యలపై సానుకూలంగా చర్చించుకుందామని, ఇందులో పార్టీలు, రాజకీయాలకు ఏ మాత్రం చోటుందంటూ, ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఆ సమావేశానికి రావాలని సీఎం కోరారు. నియోజకవర్గంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదని, ప్రతి ఇంటికి పాడి పశువులను అందజేస్తామని స్పష్టం చేసారు. నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండటమే తన కర్తవ్యమని, ఇందుకు గతంలో చెప్పిన విధంగా ప్రతి వ్యక్తికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ తప్పనిసరి చేయాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో మనిషి మనిషికి హెల్త్ కార్డులు ఉన్నాయని గుర్తు చేసారు. హెల్త్ ప్రొఫైల్ (గజ్వేల్ నియోజకవర్గ ఆరోగ్య సూచిక)ను త్వరలోనే ప్రారంభించే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కలెక్టర్ వెంకట్రాంరెడ్డిలకు సూచించారు. ఇక్కడ విజయవంతం అయితే కంటి వెలుగు కార్యక్రమం మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశం లభిస్తుందన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే మంత్రులందరికీ కృతజ్ఞుడిగా ఉంటానని భరోసా ఇచ్చారు. అద్భుతాలు సృష్టించడంలో సాధ్యం కానిదంటూ లేదని, అన్నా హజారే, ప్రొఫెసర్ బండార్కర్ తదితరులు ఎన్నో సాధించారని, వారిలాగే మనం ముందుకు సాగుదామంటూ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ ఊరికి ఆ ఊరు స్వయం సమృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని ఉద్బోధించారు. గజ్వేల్ నియోజకవర్గం పచ్చదనంతో పరఢవిల్లి దేశానికి ఆదర్శంగా నిలిపేలా ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఆకాంక్షను ముఖ్యమంత్రి వ్యక్తం చేసారు. ఈ నియోజకవర్గంలో 30 వేల ఎకరాల అడవి ఉందని, కొండపాక మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ పరిసర ప్రాంతంలో 7500 ఎకరాల అటవీ భూమి ఉందని, ఆ భూమిని అభివృద్ధి చేయాలని సూచించారు. మంత్రులు హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్టస్థ్రాయి కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం... అధికారులను సన్మానిస్తున్న సీఎం కేసీఆర్