తెలంగాణ

సుస్థిరంగా నిలబడే ప్రాజెక్టు కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 11: సారవంతమైన భూముల్లో రైతులు సాగు చేసే పంటలకు కావల్సిన నీటిని అందించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వందల సంవత్సరాలు సుస్థిరంగా నిలబడుతుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ బుధవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు. తన నియోజకవర్గం పరిధిలో భూసారంతో కూడిన భూముల్లో రైతులు వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారని ఆనందం వ్యక్తం చేసారు. సాగునీటిని అందించాలన్న దృఢసంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నేపథ్యంలోనే గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నింపుతామని తెలిపారు. వచ్చే జనవరి నెలాఖరునాటికి కాళేశ్వరం నీటిని గజ్వేల్‌కు తరలిస్తామని సీఎం స్పష్టం చేసారు. అన్ని గ్రామాల రైతుల వ్యవసాయ భూములకు, జలాశయాలకు నీటిని చేరవేసేందుకు అవసరమైన కాలువలు పారాల్సిన అవసరం ఉందన్నారు. భవిషత్తులు చెరువులు, కుంటలు ఎండిపోయే దాఖలాలు లేకుండా కాళేశ్వరం నుండి నీటిని తరలిస్తామని వెల్లడించారు. భవిషత్ తరాలు సుభిక్షంగా జీవించేలా వందల సంవత్సరాలు స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుందని, ఈ ప్రాజెక్టు క్రింద రిజర్వాయర్ల నిర్మాణం కూడా కొనసాగుతుందని స్పష్టం చేసారు. అవసరమైన భూములను న్యాయబద్ధంగా తీసుకోవాల్సి ఉంటుందని, కానియెడల బలవంతంగానైనా తీసుకోవాల్సి వస్తుందన్నారు.
‘మహతి’ అంటే నారదుడి మెడలోని వీణ
నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా సభలు, సమావేశాలు, సమీక్షలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుకలిగేలా గజ్వేల్‌లో నిర్మించిన ఆడిటోరియానికి ‘మహతి’ అనే నామకరణం తానే చేసినట్టు సీఎం కేసీఆర్ స్పష్టం చేసారు. ‘మహతి’ అనే పదానికర్థాన్ని వివరిస్తూ ముల్లోకాలను సంచరిస్తూ విలువైన సమాచారాలను దేవతాసురులకు తెలియజెబుతూ సమాజ శ్రేయస్సును కాంక్షించే నారదుడి మెడలో ఉండే వీణ అంటూ తెలియపర్చారు. సప్త స్వరాలతో తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సాహితి సౌరభాలతో దేదీప్యమానంగా వెలుగొందుతూ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
మానవ మనుగడకు అటవీ సంపద పరిరక్షణ అత్యవసరం
పచ్చదనాన్ని పెంపొందించడం ప్రధానమైందిగా గుర్తించి భారత ప్రభుత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పేరిట (ఐఎఫ్‌ఎస్)ను ఏర్పాటు చేసి అటవీ సంపద పెంపొందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ఐఎఫ్‌ఎస్ అధికారికా ప్రియాంక వర్గీస్ నియమితులై చక్కటి విజయాలను సాధిస్తున్నారని అభినందించారు.
కేరళ రాష్ట్రంలో పుట్టిన ప్రియాంక వర్గీస్ ఐఎఫ్‌ఎస్ విద్యాభ్యాసం మాత్రం తమిళనాడులోని మెట్టుపాలెం అగ్రికల్చర్ కాలేజీలో చదువుకుని ఈ స్థాయికి ఎదిగారని, ఆమెతో పాటు మరెంతో మంది స్థిరపడ్డారని తెలుపుతూ ములుగులో ప్రారంభించిన అగ్రికల్చర్ కాలేజీలో కూడా విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు.

*చిత్రాలు.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మాట్లాడుతున్న దృశ్యం, హాజరైన ప్రజాప్రతినిధులు