తెలంగాణ

విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్లే అరాచకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతుండటం వల్లనే మహిళలపై అఘాయిత్యాలు పెరగడానికి కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం మహిళలపై జరుగుతోన్న దాడులను అరికట్టడంలో వైఫల్యం చెందాయని ఆయన ఆరోపించారు. మద్యం అమ్మకాలను నియంత్రించక పోవడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆదాయ వనరుగానే చూస్తుందని విమర్శించారు. ఆర్థిక మాంద్యం ఉంటే మద్యం అమ్మకాలపై ఆదాయం ఎలా పెరిగిందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. శాసనసభ కమిటీ హాల్‌లో మంగళవారం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ‘దిశ’ హత్య జరిగిందన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నిందితులను ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు. సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేస్తుందని ధ్వజమెత్తారు.