తెలంగాణ

రాష్ట్ర ఆదాయంపై ఆర్థిక మాంద్యం ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్ర రెవెన్యూ రాబడులపై పడింది. ఆర్థిక మాంద్యం హెచ్చుగా ఉందని, దీని వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని ఇటీవల పదే పదే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయం విదితమే. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అన్ని రాబడులపై ఆదాయం రూ.830 కోట్ల మేర తగ్గింది. రాష్ట్రం మొత్తం రెవెన్యూ రూ.44,615 కోట్లు రావాల్సి ఉండగా, రూ.43,777 కోట్లు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి సాలీనా రెవెన్యూ వృద్ధిరేటు 21 శాతం పెరుగుతూ వస్తోంది. ఇదే వృద్ధిరేటు నమోదై ఉంటే అదనంగా రూ.15వేల కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఆదాయం తగ్గినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తం పైన రాష్ట్ర రెవెన్యూ నిలదొక్కుకుంటే, కేంద్రానికి వెళ్లే పన్నుల ఆదాయం తగ్గింది.
గత ఏడాది అక్టోబర్‌కి జీఎస్‌టి ఆదాయం 16,429 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.14,097 కోట్లకు తగ్గింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఏడాది రూ.3127 కోట్లు వస్తే, ఈ ఏడాది రూ.3716 కోట్లకు పెరిగింది. అమ్మకం పన్ను రూ.6019 కోట్లు వస్తే, ఈ ఏడాది 6176కోట్లకు పెరిగింది. కేంద్ర పన్నుల నుంచి గత ఏడాది అక్టోబర్ వరకు రూ. 8578 కోట్లు వస్తే, ఈ ఏడాది రూ.6404 కోట్లు వచ్చింది. కేంద్ర పన్నుల ఆదాయం తగ్గగా, రాష్ట్ర పన్నుల ఆదాయం స్థిరంగా ఉండి పెరిగింది. రియాల్టీ ఆదాయం చూస్తే హైదరాబాద్ మార్కెట్ జోరుగా ఉన్నట్లు విదితమవుతుంది. జీఎస్‌టీ ఆదాయం దాదాపు రెండు వేల కోట్లు తగ్గింది. కేంద్ర పన్నుల వాటా కూడా అంతే. ఇవన్నీ చూస్తే వచ్చే మార్చిలోపల రెవెన్యూను మెరుగుపరుచుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం వల్ల జీఎస్‌టీ, కేంద్ర పన్నుల రాబడి తగ్గిందని అధికారులు చెబుతున్నారు.