తెలంగాణ

దిశ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సమయం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: దిశ కేసులో రాష్టమ్రంత్రులు, టీఆర్‌ఎస్ పార్టీలో కీలక పాత్రవహించే కేటీఆర్, హరీష్‌రావులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడాన్ని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు 30 మంది మరణించినా ఈ మంత్రులు జాలి చూపలేదన్నారు. కేవలం వత్తిడి మధ్యనే ఆర్టీసీ సమ్మె కార్మికులను పిలిచి మాట్లాడారన్నారు. చార్జీలు పెంచేందుకు కేసీఆర్ హైడ్రామా ఆడారన్నారు. ఆర్టీసీని కాపాడలేమని, నిధులు లేవని చెప్పిన కేసీఆర్ చివరకు మాట మార్చారన్నారు. ఆర్టీసీని విలీనం చేసే విధంగా ఆర్థిక స్థితి ఉన్నా, కేవలం నియంతృత్వ వైఖరితోనే కేసీఆర్ వ్యవహరించారన్నారు. కేసీఆర్ మాటను మార్చడం చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజలపై భారం వేశారన్నారు. రాష్ట్రంలో రైతు బందు, సంక్షేమ కార్యక్రమాలను అటకెక్కించారన్నారు. పరిపాలనకు గాలికి వదిలేసి ప్రగతిభవన్‌కు పరిమితమయ్యారన్నారు.