తెలంగాణ

పచ్చని పల్లెను నిర్మిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జూలై 16: పచ్చని పల్లెలను నిర్మించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వృక్షాలను పెంచాలని సినీ నటుడు మహేష్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పిలుపునిచ్చారు. మహేష్‌బాబు దత్తత తీసుకున్న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా నమ్రత శిరోద్కర్, జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవిహాజరై మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో నమ్రత శిరోద్కర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మొక్కల నాటే కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడిందని అన్నారు. మానవ మనుగడ ముందుకు సాగాలంటే వృక్షాలతోనే సాధ్యమన్నారు. వృక్షాలు ఉంటే వర్షాలు సమృద్ధుగా కురుస్తాయని, తద్వారా రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు. జల సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని, ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే మహత్తర కార్యక్రమాల్లో ప్రజలు తమవంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. దత్తత తీసుకున్న సిద్దాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. దశలవారీగా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. సిద్దాపూర్ గ్రామంలో చాలామంది ప్రజలు పాడిపరిశ్రమ, వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. గ్రామంలో పశువైద్యాధికారిని వెంటనే నియమించేలా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించేందుకు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు వివరించారు. పాఠశాలలో విద్యార్థులు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి మరుగుదొడ్లను నిర్మించినట్లు తెలిపారు. సిద్దాపూర్ గ్రామంలో వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు.

చిత్రం.. పాఠశాల అవరణలో మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న నమ్రతా శిరోద్కర్, కలెక్టర్ శ్రీదేవి