తెలంగాణ

నిరంకుశ వైఖరికి స్వస్తిచెప్పండి: సీపీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: ఆర్టీసీ యూనియన్లతో ప్రభుత్వం చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ప్రభుత్వం నిరంకుశ ధోరణిని విడనాడాలని, నిర్బంధాలకు స్వస్తి చెప్పాలని ఆయన హితవుపలికారు. 38 రోజుల చారిత్రాత్మక సమ్మెను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఉక్కుపాదంతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ప్రజలు ఉప్పెనలా ప్రతిఘటిస్తారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రికి కనువిప్పుకలగాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమంలో చంద్రబాబులా కేసీఆర్ వ్యవహరిస్తే ప్రజలు ప్రతిఘటిస్తారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మనసు మార్చుకుని ఆర్టీసీ సమ్మెను పరిష్కరించడానికి ముందుకు రావాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలని పేర్కొన్నారు.
ఉద్యమం ఉధృతం: చాడ
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదని అన్నారు. ప్రజాస్వామిక ఆకాంక్షలకు విరుద్ధంగా సీఎం కేసీఆర్ పాలన ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు తన బిడ్డల వంటి వారని గతంలో చెప్పిన కేసీఆర్ వారి డిమాండ్లను ఎందుకు పెడచెవిన పెడుతున్నారని నిలదీశారు.