తెలంగాణ

తీర్పును గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అందరినీ సంతృప్తిపరచకున్నా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించాలని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించి శాంతి, సహనంతో ఉండాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం తన విచక్షణతో ఇచ్చిన తీర్పు అని అన్నారు. తీర్పులు అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదని, మన దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించి తీరాలని అన్నారు. కాగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఈ దేశం సుప్రీం తీర్పు అనంతరం ఐక్యంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బెంచి అయోధ్యపై తుది తీర్పు ఇచ్చిందని, ఈ తీర్పు అందరినీ సంతృప్తిపరుస్తుందని భావించలేమని అన్నారు. అన్ని సాక్ష్యాలను, ఆధారాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించినందున దానిని అందరూ ఆమోదించాలని అన్నారు. రామజన్మభూమి సమస్య రావణకాష్టంగా ఇంతకాలం కొనసాగిందని, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు దానిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశాయని సీపీఐ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యకరమైన తీర్పుకాకపోయినా, స్థూలంగా ఈ భారతదేశానికి ఉన్న పరిస్థితుల్లో ఈ తీర్పు అత్యంత అవసరమని నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజలు అంతా ఈ తీర్పును ఆమోదించాలని ఆయన కోరారు. తీర్పులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటం సాధ్యం కాదని పేర్కొన్నారు.