తెలంగాణ

నిర్ణీత గడువులోగా విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 14: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో గురువారం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులను కేంద్ర ప్రభుత్వం నుండి త్వరలోనే వస్తాయని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విడత ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై ప్రధానమంత్రితో పాటు సంబంధిత మంత్రులతో చర్చించి త్వరితగతిన అనుమతులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు రావడం ఇష్టంలేని వారు, చీకట్లో ఉండాలని కోరుకునే వారు ఎక్కువ ధరలకు విద్యుత్ కొనుగోళ్లు జరుపుతున్నామని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు వెలుగు వస్తే తాము చీకట్లో ఉండిపోవాల్సి వస్తుందన్న అక్కసుతోనే వారు కుట్రలు చేస్తున్నారన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరా విషయంలో దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ధరలకే అందిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించిన 2018 నాటికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అంచెలంచెలుగా అవినీతిని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. క్షేత్రస్ధాయి నుండి అవినీతిని నిర్మూలించేలా అన్ని ప్రభుత్వశాఖలను ప్రక్షాళన చేస్తూ సాంకేతికతను జోడించి పారదర్శకంగా పథకాలను అమలు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు.

చిత్రం.. సూర్యాపేటలో విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి