తెలంగాణ

కాలుష్యరహితమైతే అనుకూలమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 14: మహబూబ్‌నగర్ జిల్ల్లా ధరూరు మండల పరిధిలోని చింతరేవుల గ్రామంలో దాదాపు పదేళ్ల క్రితం జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ కంపెనీ స్పాంజ్ ఐరన్ పరిశ్రమ స్థాపనకు దాదాపు 270 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. స్పాంజ్ ఐరన్ పరిశ్రమ అనుమతుల కోసం ప్రభుత్వ అధికారులు, పర్యావరణ అధికారులు అప్పట్లో గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పాంజి ఐరన్ పరిశ్రమతో ఈ ప్రాంత భూమలు కాలుష్యంతో వ్యవసాయానికి పరికిరావని, ప్రజల ఆరోగ్యాలపై కూడా తీవ్ర ప్రభావం ఉందని గ్రామస్థులు ఆ పరిశ్రమ ఏర్పాటును అడ్డుకున్నారు. దీంతో గత కొనే్నళ్లుగా పరిశ్రమ యజమానులు కంచెను ఏర్పాటు చేసుకొని టేకు తదితర మొక్కలను పెంచారు. తాజాగా బుధవారం జైరాజ్ ఇస్పాత్ నిర్వాహక డైరెక్టర్ సిద్దార్థజైన్ రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ను కలిసి ఉక్కు కర్మాగార ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు ప్రకటించారు. రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు 4700 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రికి వివరించారు. దీంతో స్పందించిన కెటిఆర్ ఇందుకు సంబంధించి అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు సహకరించాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవిలను ఆదేశించారు. ఈ విషయంపై గురువారం చింతరేవుల గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ హనుమంతరాయ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ జైరాజ్ కంపెనీ ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం సంతోషించదగ్గ విషయమన్నారు. అయతే, పరిశ్రమ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఎలాంటి హాని లేకుండా ఉంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. చింతరేవుల గ్రామపెద్ద రాజేష్ మాట్లాడుతూ కాలుష్యరహితంగా పరిశ్రమ ఏర్పాటు చేసి భూములు కోల్పోయిన రైతులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని, ఈ ప్రాంత యువతకు అవకాశాలు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్వాసిత రైతు ఆంజనేయులు, సలీం మాట్లాడుతూ గతంలో తక్కువ ధరకు కొనుగోలు చేశారని, ప్రస్తుతం పది రెట్లు ఎక్కువగా విలువలు పెరిగాయని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

చిత్రం.. ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసే భూములు ఇవే..