తెలంగాణ

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ చార్మినార్, జూలై 14: సుదీర్ఘకాలం పాటు సాగిన అనేక పోరాటాలు, అమరవీరుల ఆత్మబలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సకల జనులకు సమానంగా అందేలా ప్రభుత్వం చూడాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లిం ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్‌లో జరిగిన ఈద్ ఎ మిలాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు ఫ్రంట్ ఆధ్వర్యంలో పలు అంశాలపై వివిధ కుల, విద్యార్థి, ప్రజాసంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అనంతరం వేదకుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి సమాన ఫలాలు అందించేందుకు వీలుగా ఓ ప్రతిపాదనను తయారు చేసి, సర్కారుకు సమర్పించేందుకు అన్ని సంఘాలు ముందుకు రావాలని సూచించారు.