తెలంగాణ

ఆర్టీసి ఎన్నికల్లో మంత్రుల జోక్యమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: ఈనెల 19న జరిగే తెలంగాణ ఆర్టీసి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నాయకుల జోక్యం ఎందుకని టిఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసిలో ట్రేడ్ యూనియన్‌ల మధ్య జరిగే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం ఎంప్లారుూస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా జరిగే ఎన్నికలను రాజకీయ కలుషితం చేస్తున్నారన్నారు. ఎంప్లారుూస్ యూనియన్ గెలుపు బాటలో ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే రాష్ట్రంలోని ఆయా డిపోలకు వెళ్లి మద్యం, డబ్బుతో ప్రలోభపెట్టి కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.