తెలంగాణ

దళారీ వ్యవస్థ నిర్మూలనకే ఈ-మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూలై 14: మార్కెటింగ్ వ్యవస్థలో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ-మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పార్ధసారధి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పత్తి మార్కెట్ యార్డులో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు నేరుగా మార్కెట్‌కు ధాన్యం తీసుకువచ్చి విక్రయించుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అన్నదాతలను దగా చేస్తున్న దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ఈ-మార్కెట్ (ఆన్‌లైన్) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాదే దళారీల నుండి విముక్తి పొందేందుకు పత్తి రైతులకు కార్డులు జారీ చేశామని, ఈ ఏడాది పూర్తి స్థాయిలో అన్ని వర్గాల రైతులకు కార్డులు అందించనున్నట్లు ఆయన తెలిపారు. కార్డు కలిగిన రైతుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లిస్తామన్నారు. గత ఏడాది పత్తి సీజన్‌లో రైతులకు బదులుగా దళారీలు ఎక్కువగా లాభం పొందారని రైతులు పార్ధసారధి దృష్టికి తీసుకువెళ్లగా అందుకు ఆయన స్పందిస్తూ ఈ ఏడాది అలాంటివేమీ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ వస్తుందని, ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికై ఫైల్ పంపించామన్నారు. ఏ మార్కెట్‌లోనైనా దళారీ వ్యవస్థ ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం తీసుకువచ్చే రైతులకు ‘తక్‌పట్టీలు’ విధిగా మార్కెటింగ్ శాఖ అధికారులు ఇవ్వాలని ఆయన సూచించారు. రైతులను మోసాలకు గురిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు.