తెలంగాణ

సాగర్ 18 గేట్ల ద్వారా నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, అక్టోబర్ 23: నాగార్జునసాగర్ జలాశయానికి బుధవారం నుండి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో సాగర్‌లో 18 క్రస్టు గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. మంగళవారం నాడే సాగర్ ఎగువన శ్రీశైల జలాశయానికి ఇన్‌ఫ్లో తాకడంతో సాగర్‌లో రెండు గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభించారు. బుధవారం ఉదయం వరకు 14 గేట్ల ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో ప్రస్తుతం 18 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి వస్తున్న ఇన్‌ఫ్లో మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున సాగర్‌లో గేట్ల ద్వారా విడుదల చేసే నీటి పరిమాణం పెరగనుంది. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 4,35,401 క్యూసెక్కులు వస్తుండగా వచ్చింది వచ్చినట్టుగా గేట్ల ద్వారా కుడి, ఎడమ కాల్వలు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ప్రస్తుతం 589.60 అడుగులు ఉండగా కుడి కాల్వ ద్వారా 6,766 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 2,557 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 32,418 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులను 18 క్రస్టు గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి 3,91,050 క్యూసెక్కులను, మొత్తంగా 4,35,401 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుండి 4,48,648 క్యూసెక్కులు వస్తుండగా ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. సాగర్ డ్యాం క్రస్టు గేట్ల ద్వారా భారీగా నీటి విడుదల జరుగుతుండటంతో డ్యాం దిగువ భాగాన శివాలయం ఘాట్, అంజనేయస్వామి ఘాట్ వద్ద సందర్శకులు కృష్ణా నదిలో దిగకుండా ఎస్‌ఐ శ్రీనివాస్ చర్యలు తీసుకుంటున్నారు.
*చిత్రం... సాగర్‌లో 18 గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు