తెలంగాణ

కాంగ్రెస్‌లో ఎవరైనా పులిలా బతకొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఈ పార్టీ ఎమ్మెల్యేలు పులిలా ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎంపీ, పీసీసీ మాజీ నేత కే కేశవవరావు కాంగ్రెస్ పార్టీలో పులిలా ఉండేవారన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో పిల్లిలాగా బతుకుతున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన డీ శ్రీనివాస్ కూడా కాంగ్రెస్‌లో పులిలాగా బతికారని, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి కనుమరుగయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్షంలోనే కాకుండా, అధికారంలో ఉన్నా, పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల కోసం సొంత పార్టీ ప్రభుత్వంపై పోరాడుతారన్నారు.
సొంత పార్టీ మంత్రులను, ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గతంలో నిలదీసిన సందర్భాలు కోకొల్లలని చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉండదన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ న్యాయపరమైనదన్నారు. తాను మూడు రోజుల పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మెదీక్షల్లో పాల్గొన్నట్లు చెప్పారు. తాను ప్రగతిభవన్ ముట్టడిలో కూడా పాల్గొన్నట్లు చెప్పారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ కోసం ప్రతిపాదనలు పంపినందుకు సీఎం కేసీఆర్‌కు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ పార్టీల్లో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉండదన్నారు.
జాతీయ పార్టీలో స్వేచ్ఛ ఉండదన్నారు. ఆర్టీసీ సమ్మెపై న్యాయస్థానం చెప్పినట్లు కమిటీ వేసినందుకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల స మస్యలను రాష్ట్రప్రభుత్వం పరిష్కారం చేస్తే అధికార పార్టీకి పాలాభిషేకం చేస్తానన్నారు.
హుజూర్‌నగర్‌లో గెలుపు తథ్యం: మల్లు రవి
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి విజయం సాధిస్తారని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ గెలుపుపై ఎటువంటి సందేహం అక్కర్లేదన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుస్తుందని కొన్ని తప్పుడు సర్వేలు ప్రచారంలో ఉన్నాయన్నారు. ఈ సర్వేలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. టీఆర్‌ఎస్ కేవలం ప్రజలను ప్రలోభ పెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందన్నారు. జమ్మికుంటలో కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కరీంనగర్ మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీ పేరున యాత్ర చేసే హక్కు గాడ్సే భక్తులకు లేదన్నారు. బీజేపీకి గాడ్సే దేశ భక్తుడని, జాతి పిత గాందీ ఏమిటో చెప్పిన తర్వాతనే బీజేపీ గాంధీ సంకల్ప యాత్రను చేయాలన్నారు. కరీంనగర్ ఎంపీ గుండాయిజాన్ని ఆయన ఖండించారు.