తెలంగాణ

రైతులకు రుణాలు ఇవ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించి ఓటాన్ అకౌంట్‌లో ఆరు వేల కోట్లు కేటాయించి, ఆ నిధులను బ్యాంకులకు విడుదల చేయకపోవడంతో రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టీ సాగర్ పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం అధ్యక్షుడు పీ జంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. అనంతరం సాగర్ మాట్లాడుతూ 2019-20 రుణ ప్రణాళికలో రబీకి 19240 కోట్లు, ఖరీఫ్‌కు 29,500 కోట్లు కేటాయించారని, ఖరీఫ్ రుణాలు 11,500 కోట్లు ఇచ్చినట్టు బ్యాంకులు చెబుతున్నాయని, ఇది బుక్ అడ్జస్టుమెంట్ మాత్రమేనని అన్నారు. 55 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా 28 లక్షల మందికి మాత్రమే రుణాలు ఇచ్చారని, మిగిలిన 27 లక్షల మందికి ఇంత వరకూ ఏనాడూ రుణాలు ఇవ్వలేదని అన్నారు. దీర్ఘకాలిక రుణాలు కింద 6929 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇందులో ఇంత వరకూ ఒక్కరికీ రుణాలు ఇవ్వలేదని అన్నారు. పంట రుణాలు ఇవ్వకపోవడం వల్ల ఈసారి పంట బీమాకు ప్రీమియం వసూలు చేయలేదని ,రుణం పొందని వారు స్వచ్ఛందంగా బీమా చెల్లించే పరిస్థితి లేదని అన్నారు.