తెలంగాణ

ఆర్టీసీ విలీనం అసాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, అక్టోబర్ 19: సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టడానికే కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆరోపించారు. ఆయన శనివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఆర్టీసీ విలీనం సాధ్యమైనప్పుడు తెలంగాణాలో మిగులు బడ్జెట్, ధనిక రాష్టమ్రని చెప్పిన ముఖ్యమంత్రికి విలీనం ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే విలీనంపై కమిటి వేయగా కమిటి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందన్నారు. సకలజనుల సమ్మె జరిగే సమయంలో అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వం ఒక్క కార్మికుడిని కాని, ఒక్క ఉద్యోగుడిని కాని తొలగించలేదని అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కార్మికులను చర్చలకు పిలిచినా తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా కార్మికులు చర్చలకు వెళ్లలేదని, నేడు చర్చలకు సిద్దమని కార్మికులు పదేపదే చెప్తున్నా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘ తెలంగాణ పోరాటంలో అప్పటి ప్రభుత్వాలు ఉద్యమాలను అణిచివేసే పనిచేయలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించిన రోజునే 48వేల మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించామని ప్రకటన చేయడం ప్రజాస్వామ్యాన్ని హరించడమేనన్నారు. కార్మికవర్గాలను చంపి కెనడా పాలసీని అమలు చేసి ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. దీనిని గమనించే కోర్టు ఫిలిప్పీన్స్ తరహాలో ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. న్యాయవ్యవస్థను, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి ఎంత నియంతనో అర్ధమవుతుందని విమర్శించారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి గెలిస్తే తెలంగాణ ప్రజలు మావెంటే ఉన్నారని, ఇంకా నియంతగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని ఓడించేవారికి మద్దతు తెలిపి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు యడవెల్లి చంద్రయ్య, బాలచంద్రు, కొమ్ము వెంకటేశ్వర్లు, ఇంజమూరి పున్నయ్య, నగేష్, సందీప్, కిరణ్, సాయి, నాగరాజు, మహేష్, సురేష్, స్వప్న, యాకుబ్‌లు పాల్గొన్నారు.
*చిత్రం...నేరేడుచర్లలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ