తెలంగాణ

స్వేచ్ఛకు.. నిర్బంధానికి మధ్య జరుగుతున్న పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, అక్టోబర్ 19 : హుజుర్‌నగర్ ఉప ఎన్నికలు సాదారణమైనివి కావని తెలంగాణలో స్వేచ్చకు...నిర్భందానికి మధ్య జరుగతున్న ఎన్నికలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పొనుగోడులో శనివారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హామిలిచ్చి ఎన్నికల్లోగెలిచి అధికారంలోకి వచ్చాక హామీలన్నీంటిని గాలికి ఒదిలేసిన కెసి ఆర్ పాలనకు ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తగినవిధంగా బుద్దిచెప్పాలన్నారు. హుజుర్‌నగర్ ఎన్నిక కేవలం ఎమ్మేల్యేని ఎన్నుకునే ఎన్నికలు కావని, నాలుగుకోట్ల ప్రజానికం బానిసలాగా బతకాలా, స్వేచ్చగా జీవించాలా అనే విషయంపై జరుగుతున్న ఎన్నికన్నారు. స్వేచ్చకు నిర్భందానికి మద్య జరుగుతున్న ఎన్నికలన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఓటు అడిగే హక్కుందా.. ఏం చేయకుండ సీసాలిచ్చే, మూటలుతీసుకొచ్చే టి ఆర్ ఎస్‌కు అడిగే హక్కుందా అని ప్రశ్నించారు. మోసపూరిత మాటలు,వాగ్థానాలతోటి ఆర్ ఎస్ ప్రజల ముందుకొచ్చిందని వారి మోసాలను ఈ ఎన్నికల్లో ఎండగట్టాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే పేదోనికోసం ప్రగతిభవన్ గేట్లు తెరుచుకుంటాయన్నారు. ఉత్తమ్‌పద్మావతిని 30వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వేసే ఓటు కెసి ఆర్‌కు గుండెపోటు తీసుకురావాలన్నారు. కెసి ఆర్ రాజ్యంలో అరాచకత్వం, పోలీసుల అణిచివేతలతో,అక్రమకేసులు, కాంట్రాక్టులతో, దోపిడిలతో,కమీషన్‌లతో, భూములు కబ్జాపెట్టుకున్న లాండ్‌మాఫియాలతో టిఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తుందన్నారు. కేవలం నలుగురి వ్యక్తుల కబంధహస్తంలో తెలంగాణ సమాజం నలిగిపోతుందన్నారు. ఆనలుగురి నిర్భందం కావాలానా... కాంగ్రెస్‌లో దక్కే స్వేచ్చ కావాలో ప్రజలు ఈ ఎన్నికల్లో తేల్చుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని నిలువున దోపిడి చేస్తున్న కెసి ఆర్ కుటుంబానికి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ప్రజలు ఆలోచించి ఉత్తమ్ పద్మావతిరెడ్డికి ఒటువేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజిమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి,పటేల్ రమేష్‌రెడ్డి, సాముల శివారెడ్డి, అప్పిరెడ్డి, చక్రధర్, కటకం రమేష్‌తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...గరిడేపల్లి మండలం పొనుగోడులో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి.