తెలంగాణ

అన్ని వర్గాలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆర్టీసీ జేఏసీ సమ్మెకు మద్దతుగా చేపట్టిన నేటి రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాలు సై అంటూ సంఘీభావం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం, ప్రభుత్వయేతర రంగల్లో ఉన్న అన్ని ఉద్యోగ, కార్మిక వర్గాలకు చెందిన సిబ్బంది శనివారం జరగనున్న రాష్ట్ర బంద్‌లో పాల్గొనడానికి సిద్ధం అయ్యాయి. దీంతో బంద్ విజయవంతం చేయడానకి కార్యాలయాల భోజన విరామ సమయంలో బంద్‌లో పాల్గొననున్నారు. ఆర్టీసీ జేఏసీ తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లకు అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు, వామపక్షాలు ఆర్టీసీ జేఏసీకి అండగా నిలిచాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ రెవెన్యూ సంఘాలు ఇప్పటికే సంఘీభావం ప్రకటించాయి. మధ్యాహ్నా విరామ సమయంలో బంద్‌లో పాల్గొంటూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేయాలన్నారు. తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి జేఏసీకి మద్దతు ప్రకటించారు. తెలంగాణ తహశీల్దార్ అసోషియేషన్ అధ్యక్షుడు రాములు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర టీవీఆర్‌ఓ డబ్ల్యూఏ అధ్యక్షుడు గరికె ఉపేందర్, రాష్ట్ర టీవీఆర్‌ఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, రాష్ట్ర టీఎస్‌వీఆర్‌ఏ బాలనర్సయ్య, రాష్ట్ర టీఆర్‌ఎస్‌ఏ ప్రదాన కార్యదర్శి సంతోష్, రాష్ట్ర టీఎస్‌వీఆర్‌ఏ ప్రధాన కార్యదర్శి వంగూరు రామలు, రాష్ట్ర టీవీఆర్‌ఏ ప్రధాన కార్యదర్శి సుధాకర్, తెలంగాణ జనసేన ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్, క్యాబ్ డ్రైవర్స్ అసోషియేషన్, డాక్టర్ వెల్పేర్ అసోషియేషన్, రేషన్ డీలర్ల సంఘం, న్యాయవాదుల, ఉద్యోగాల సంఘాలు బంద్‌లో పాల్గొనున్నాయి. హైదరాబాద్ మహాత్మాగాంధీ ప్రధాన బస్టాండ్‌తో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని సీపీఎం ఆఫీస్ కార్యదర్శి బాబురావు తెలిపారు. టీఎస్ తెలంగాణ టీడీపీ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ బంద్‌లో పాల్గొంటారని ఆ పార్టీ మీడియా కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు బంద్‌లో పాల్గొంటారని సంబంధిత సంఘం అధ్యక్షుడు పద్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ్ధర్ తెలిపారు. విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భానుప్రకాశ్ బంద్‌లో పాల్కొనున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా చేపట్టిన బంద్‌లో సకలజనులు పాల్గొనాలని ఆయన పిలుపు ఇచ్చారు.
న్యాయవాదుల నిరసన : కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నాంపల్లి కోర్టు ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను న్యాయవాదులు దహనం చేశారు. న్యాయవాదుల చర్యలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నాంపల్లి కోర్టు నుండి న్యాయవాదులు బస్‌భవన్ వరకూ బైక్‌ర్యాలీ నిర్వహించాలని చూడగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.