తెలంగాణ

ప్రభుత్వం మెట్టు దిగాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారవాణా లేక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఉన్నందున ప్రభుత్వం ఒక మెట్టుదిగాల్సిందేనని వామపక్షాలు డిమాండ్ చేశాయి. గురువారం ఇందిరాపార్క్ వద్ద ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా వామపక్షాలు భారీ ధర్నా చేపట్టాయి. ధర్నాకు వామపక్షాల నేతలు, పార్టీ కేడర్ తరలిరావడంతో అనూహ్య స్పందన వచ్చింది. ఈ ధర్నాలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వరావు పాల్గొన్నారు. ధర్నా నుద్దేశించి వామపక్షాల నేతలు మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టారు. సమ్మెకు పరిష్కారం చూడాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో ప్రకటన చేస్తూ సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడం దర్మార్గం అన్నారు. ఆర్టీసీ జేఏసీపై సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అంటూ వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. లాభాలు వచ్చే మార్గాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పుతూ నష్టాలు ఉన్న మార్గాల్లో ఆర్టీసీ బస్‌లను తిప్పడంలో ఆంతర్యం ఏమిటో సీఎం చెప్పాలని వారు నిలదీశారు. రాబోవు రోజుల్లో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి దశలవారిగా ప్రయత్నాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో భాగమేనన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై సీఎం రాజకీయ క్రీడలను కొనసాగించడం దురదృష్టకరమన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులను తొలగించి, రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ చేసే ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టడం ఖాయమన్నారు. సమ్మెతో ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు ప్రజల నుంచి వస్తున్న మద్దతు స్పష్టం అవుతోందన్నారు. ప్రజలు కూడా ఆర్టీసీ సమ్మె న్యాయమైనదేనని మద్దతు పలకడం జరుగుతోందన్నారు. సమ్మె విషయంలో ప్రస్తుతం సీఎం వర్సెస్ తెలంగాణ సమాజం అనే విధంగా మారిందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్ తనకు ఎదురులేదని విర్రవీగుతున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. కాగా సమ్మె చేస్తున్న జేఏసీపై కార్మిక సంఘాల్లో చిచ్చు మొదలైయ్యిందిని జేఏసీలో లేని కార్మిక సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఆర్టీసీలో 10 కార్మిక సంఘాలు ఉన్నాయన్న విషయం అశ్వత్థామరెడ్డి మర్చిపోయారని 6 కార్మిక సంఘాలు నేతలు కనె్నర్ర చేస్తున్నారు. కేవలం మూడు యూనియన్లతో జేఏసీ ఏర్పాటు చేశారన్నారు. మిగిలిన 6 కార్మిక సంఘాలు జేఏసీ -1 అన్న అంశాన్ని అశ్వత్థామరెడ్డి పరిగణలోకి ఎందుకు తీసుకోవడంలేదని వారు నిలదీస్తున్నారు. జేఏసీ అంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని పోకుండా జేఏసీ కన్వీనర్‌గా చెలామణి అవుతున్న అశ్వత్థామరెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అశ్వత్థామరెడ్డి తీరుపై టీజేఎంయు నేత ముదిరాజ్ హనుమంత్ బహిరంగగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.