తెలంగాణ

వేద ధర్మ రక్షణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 17 : వేద ధర్మాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పద్మనాయక కల్యాణ మండపంలో తెలంగాణ వేద విద్వన్ మహాసభల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. సద్దిపేటలో తెలంగాణ వేద విద్వన్ మహాసభలు జరిపే అవకాశం ఇవ్వటం తమ అదృష్టమన్నారు. నాలుగు రోజుల పాటు సిద్దిపేట వేద ఘోషతో సుభిక్షమవుతుందన్నారు. వేద పరిరక్షణకు ట్రస్టు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వేదం అభ్యసించిన విద్యార్థులకు ఇక్కడ పరీక్షలు నిర్వహించటం, పట్టాలు ఇవ్వటం గొప్ప విషయమన్నారు. వేద ధర్మాన్ని రక్షించేందుకు తెలంగాణ ఇతోధికంగా కృషిచేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప భక్తుడని, ధార్మిక సేవా తత్పరుడన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఆయుత చండీయాగం నిర్వహించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లోని ప్రాచీన దేవాలయాలను పునరుద్ధరిస్తున్నారన్నారు. దేవాలయంలో పనిచేస్తున్న అర్చకులను ప్రభుత్వ నిధిద్వారా వేతనాలు ఇస్తున్న ఘనత తెలంగాణ సర్కార్‌దే అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచీన దేవాలయాల అర్చకులకు ధూప, దీప నైవేద్య పథకం కింత వేతనాలు అందిస్తున్నట్టు తెలిపారు. నేటి తరం కూడా వేద పరిరక్షణకు కృషిచేయాలన్నారు. టెక్నాలజీ మోజులో పడి వేధ ధర్మాన్ని మరువద్దన్నారు. ధార్మిక, ధర్మపరిరక్షణ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వేద పండితులు రఘనాథశర్మ, వాసుదేవశర్మ, బ్రహ్మానంద శర్మ, రాధకిషన్‌శర్మ, వెంకటనర్సింహచార్యులు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు