తెలంగాణ

శాంతించిన గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూలై 13: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. బుధవారం ప్రశాంతంగా కనిపించింది. గరిష్టంగా 52.4 అడుగులకు చేరుకున్న గోదావరి మంగళవారం రాత్రి నుంచే తగ్గుముఖం పట్టింది. క్రమేణా తగ్గుతూ నీటిమట్టం కనిష్ట స్థాయిలకు చేరుకోవడంతో ఐటీడీఏ పీఓ, ఇంఛార్జ్ సబ్‌కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు రెండు ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. ముంపునకు గురైన పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లోని గ్రామాల్లోకి సెక్టోరియల్ ఆఫీసర్లు, తహశీల్దార్లు, డివిజనల్ పంచాయతీ అధికారులను హుటాహుటీన పంపించి క్లోరినేషన్ పనులు చేయించారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి బాధితులకు పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక వైద్యబృందాలను తరలించారు. జోనల్ ఆఫీసర్లు, మొబైల్ బృందాలు వరద తాకిడి ప్రాంతాల్లో సమస్యలపై తక్షణమే నివేదిక రూపంలో ఇవ్వాలని సూచించారు. అధికారులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా రహదారులన్నీ బయట పడటంతో ఆర్టీసీ అధికారులు బస్సులను వాజేడు, వెంకటాపురం, చర్ల రూట్లకు పంపించారు. ముంపు మండలాలకు కూడా పంపించారు. దారులు తెరుచుకోవడంతో నిత్యావసర వస్తువులను తరలించారు. రోడ్లు దెబ్బతినలేదని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ముంపు గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. వెంకటాపురం మండలం సూరవీడు కాలనీలో కలుషిత నీరు తాగి సోడె సమ్మక్క(65) అనే వృద్ధురాలు అతిసార వ్యాధితో మరణించింది. కాగా గ్రామంలో మరో 7గురు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. వరద తగ్గినా భద్రాచలం పట్టణంలోని అశోక్‌నగర్‌కొత్తకాలనీ జలదిగ్బంధంలోనే ఉంది. వాటిని మోటర్ల ద్వారా తోడాల్సి ఉంది. కానీ నీటిపారుదలశాఖ అధికారులు ఆ పనులేమీ చేపట్టక పోవడంతో పునరావాస కేంద్రం చుట్టూ కూడా వరద నీరు చేరింది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి.