తెలంగాణ

నల్లమలలో జెట్ విమానం చక్కర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దఅడిశర్లపల్లి, అక్టోబర్ 15: నల్గొండ జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని నల్లమల ప్రాంతమైన నంభాపురం, పెద్దగట్టు ప్రాంతాలలో మంగళవారం ఉదయం జెట్ విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టడంతో గిరిజనులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం రైతులు పత్తి చేలల్లో పనులు చేసుకుంటూ ఉండగా ఆకాశంలో వెళ్తున్న జెట్ విమానం ఆకస్మాత్తుగా ఒకేసారి భూమికి చాలాదగ్గరకు వచ్చి తిరిగి పైకి వెళ్లి పుట్టంగండి, నంభాపురం, ఎల్లాపురం, పెద్దగట్టు తదితర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టిందని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు తెలిపారు. ఆవిధంగా మూడుసార్లు కిందికి వచ్చి వెళ్లినట్టు చెప్పారు. దాదాపు 10:30 నుండి 2 గంటల వరకు తిరిగిందన్నారు. ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియంపై ఎటువంటి సర్వేలు లేవని ప్రకటిస్తుండగా, ఈ విధంగా గాలి యంత్రాలు ఆకాశంలో గ్రామాల చుట్టూ చక్కర్లు కొట్టడం పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.