తెలంగాణ

పరిశ్రమలు, లిడ్ క్యాప్ అధికారులతో కమిషన్ చైర్మన్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, లిడ్ క్యాప్ ఉన్నతాధికారులతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోల్ల శ్రీనివాస్ మంగళవారం కమిషన్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇండస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఉద్యోగుల వివరాలు. వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ఆర్‌ఓఆర్ అమలుపై వివరాలను ఇవ్వాల్సిందిగా కోరారు. ఆయా వర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ పథకాలపై చైర్మన్ ఆరా తీశారు. లిడ్ క్యాప్‌కు వచ్చిన ఆర్డర్లు, పనిచేస్తున్న యూనిట్లపై సమీక్షించారు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల కోసం శాఖ ద్వారా చేపడుతున్న సంక్షేమ పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ లేదా ప్రైవేట్ రంగ సంస్థల యూనిట్ల నుండి లిడ్‌క్యాప్‌కు అప్పగించిన వివరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షా సమావేశానికి కమిషన్ సభ్యుడు ఎం.రాంబాల్ నాయక్, ఎస్.దేవయ్య, సీహెచ్.నర్సింహ, విద్యాసాగర్, నీలాదేవితో పాటు ఆయా పరిశ్రమలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.