తెలంగాణ

హైదరాబాద్‌లో హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: హైదరాబాద్‌లో జరుగుతున్న బోనాల వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడతారన్న హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పాతబస్తీలో నిర్బంధ తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. మంగళ, బుధవారాల్లో నిర్వహించిన తనిఖీల్లో 136 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రెండు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నాకా బందీ నిర్వహించి తనిఖీలు ముమ్మరం చేశారు. కాగా, బోనాల సందర్భంగా ఈ నెల 14 నుంచి 20 వరకు పోలీసులు నగరంలో నిషేధాజ్ఞలు విధించారు. ఉగ్రదాడుల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. రెండు కమిషనరేట్ల సరిహద్దు ప్రాంతాలయిన ఒవైసీ, అన్సారీ రోడ్డు, ముస్త్ఫానగర్, గుల్జార్‌నగర్‌లలో సుమారు 600 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకు 136 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు దక్షిణ మండల డిసిపి వి సత్యనారాయణ, శంషాబాద్ డిసిపి సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ తనిఖీల్లో 120 ద్విచక్ర వాహనాలు, పది ఆటోలు, రెండు కార్లు, మూడు కత్తులు, రెండు తల్వార్లు, వంద గుడుంబా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సందర్భంగా పాతబస్తీలోని గాజుల పరిశ్రమలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన 12 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు. బాలకార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న పరిశ్రమల యజమానులపై పిడి యాక్ట్ ప్రయోగిస్తామని డిసిపిలు తెలిపారు. రెండు కమిషనరేట్ల పరిధిలోని దాదాపు 12వందల ఇళ్లలో సోదాలు నిర్వహించి వారి గుర్తింపు కార్డులు పరిశీలించినట్టు వివరించారు. పాతబస్తీలో ఇటీవల ఉగ్రవాద అనుమానితులు పట్టుబడిన నేపథ్యంలో ప్రజల్లో ఏర్పడిన భయాందోళనలను తొలగించేందుకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ఈ మధ్య కాలంలో బావరియా చైన్‌స్నాచింగ్ గ్యాంగ్ కూడా పాతబస్తీలో నివాసముంటూ రెండు కమిషనరేట్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిందని, దీనిని దృష్టిలో పెట్టుకొని నేరాలను అరికట్టేందుకే సోదాలు నిర్వహిస్తున్నట్టు వారు వివరించారు. జంటనగరాల్లో ఈ నెల 14 నుంచి 20 వరకు అనుమతిలేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, డిజెలు, ర్యాలీలపై నిషేధం ఉందని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

19న టి.ఆర్టీసి ఎన్నికలు

టిఎంయు-ఇయుల మధ్యే ప్రధాన పోటీ

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ ఆర్టీసిలో ఈ నెల 19న కార్మిక సంఘం గుర్తింపునకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కార్మిక శాఖ అధికారులు తెలిపారు. జూలై 25, 26న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్, ఆగస్టు 6న తుది ఫలితం వెలువడుతుంది. టిఆర్టీసిలో ఏడు కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ కార్మికుల గుర్తింపు సంఘానికి టిఎంయు, ఎంప్లారుూస్ యూనియన్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. బుధవారం వివిధ కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులు నగరంలోని ఆయా డిపోలకు వెళ్లి ఓట్లకోసం అభ్యర్థించారు. ఆర్టీసి కార్మికులకు రావలసిన బకాయిల చెల్లింపులు, జీత భత్యాల సవరణ వంటి హామీలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. బర్కత్‌పుర డిపోకు చెందిన 30 మంది కార్మికులు, అదేవిధంగా నగరంలోని పలు డిపోలకు చెందిన కార్మికులు ఎంప్లారుూస్ యూనియన్‌లో చేరారని టిఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు తెలిపారు.

50 శాతం మెడికల్
సీట్లు నీట్ ద్వారా భర్తీ

మిగతా 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 13: తెలంగాణలో మెడికల్, డెంటల్ కాలేజీల్లోని యుజి, పిజి సీట్లు 50 శాతం ‘నీట్’ పరీక్ష ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారని, మిగిలిన 50 శాతం సీట్లను మాత్రమే కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి చెప్పారు. ఆయుర్వేదం, యునాని, హోమియో కాలేజీల్లో సీట్లను మాత్రం ఎమ్సెట్-1 మెరిట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తామని, అలాగే అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, వెటర్నరీ, డయిరీ ఇతర కోర్సులను కూడా ఎమ్సెట్-1 ద్వారా భర్తీ చేస్తామని వివరించారు. తొలుత ఎమ్సెట్-2 మెరిట్ ద్వారా ఎంబిబిస్, బిడిఎస్ సీట్ల భర్తీ జరుగుతుందని, తర్వాత ఎమ్సెట్ -1 మెరిట్ ద్వారా యునాని, ఆయుర్వేదం, హోమియో కాలేజీల్లో సీట్లు భర్తీ చేసిన తర్వాత అగ్రికల్చర్ సీట్లను వ్యవసాయ వర్శిటీ భర్తీ చేస్తుందని, అనంతరం వెటర్నరీ సహా మిగిలిన సీట్లను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.