తెలంగాణ

డాక్టర్ల తప్పేం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13 : రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన సరోజినీదేవి కంటి దవాఖానాలో ఇటీవల జరిగిన కంటి ఆపరేషన్లు వికటించిన సంఘటన చివరకు ‘హసీబ్’ కంపెనీపై వేటు వేసేందుకు దారి తీస్తోంది. ఈ సంఘటనపై రెండు కమిటీలు వేర్వేరుగా విచారణ జరిపి, నివేదికలను ప్రభుత్వానికి అందచేశాయి. ఈ రెండు నివేదికలు ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీకి చేరాయి. ఆపరేషన్ చేసిన డాక్టర్ల తప్పేమీ లేదని, కంటిని శుభ్రం చేసేందుకు ఉపయోగించిన ‘రింగర్ లాక్టేట్’ ద్రావణమే కారణమని నివేదికల్లో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ద్రావణంలో కెబ్సియెల్లా బాక్టీరియా ఉందని, కళ్ల ఇన్‌ఫెక్షన్‌కు ఈ బాక్టీరియానే కారణమని స్పష్టం చేశాయి. ఉస్మానియా ఆసుపత్రిలోని మైక్రోబయాలజీ విభాగంలో ఈ ద్రావణాన్ని పరీక్షించారు. ఈ మేరకు రింగర్ లాక్టేట్ ద్రావణాన్ని సప్లై చేసిన ‘హసీబ్’ కంపెనీ ఉత్పత్తులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. నాగ్‌పూర్ కేంద్రంగా నడుస్తున్న హసీబ్ కంపెనీ తెలంగాణసహా అనేక రాష్ట్రాలకు ఔషధాలను సరఫరా చేస్తోంది. ఈ కంపెనీ ఉత్పత్తులపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించిందని తెలిసింది. బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం అధీనంలోని ‘మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్’ హసీబ్ కంపెనీ సరఫరా చేస్తున్న ఔషధాలను కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థ హసీబ్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూలంకషంగా పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌డిఇ ఇంటర్నల్ కమిటీకి నేతృత్వం వహించిన డాక్టర్ రవీంద్రగౌడ్ ఇప్పటికే తమ నివేదికను ప్రభుత్వానికి అందచేశారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఇ) డాక్టర్ ఎం. రమణి ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ కూడా విచారణ చేసింది. డాక్టర్ కె. వెంకటేశ్వర్లు, డాక్టర్ పాండురంగరాజు, డాక్టర్ రవిశంకర్‌లతో కూడిన నిపుణుల కమిటీ కూడా నివేదికను సిద్ధం చేసింది.