తెలంగాణ

తిరగబడ్డ మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూలై 12: మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేదిలేదని..గ్రామస్థులను సంప్రదించకుండా నాయకులు ఒప్పుకుంటే తాము ఎలా భూములు ఇస్తామని ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాన్ని ముంచేందుకు నాయకులు ఒప్పుకున్నారని ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామంలో మహిళలు నేతలను నిలదీసిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు మంగళవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో చర్చించేందుకు గజ్వేల్ వెళ్లారు. ఎకరానికి రూ.6లక్షల పరిహారం, గ్రామానికి గ్రామం, ఇల్లుకు ఇల్లు నిర్మించడమే కాకుండా ఏటిగడ్డకిష్టాపూర్ పేరుతోనే కొత్త గ్రామాన్ని నిర్మించి దత్తత తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామ పెద్దలు ప్రాజెక్టుకు అనుకూలంగా భూములు ఇస్తామని అంగీకరించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడి మంత్రి ప్రతిపాదనలకు ఒప్పుకున్న నాయకులను పంచాయతి వద్దకు తీసుకువచ్చి నిలదీశారు. గ్రామాన్ని ముంచేందుకే మీరు చర్చలకు వెళ్లారని, మీరు భూములిచ్చినా తాము ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. చర్చలకు వెళ్లిన వారిలో పిఏసిఎస్ చైర్మన్ మల్లేశం, నాయకులు నర్సింహరెడ్డిలను మహిళలు నిలదీశారు. వారితో వెళ్లిన కొందరు అక్కడికి రాకపోగా, యువకులు మాత్రం తాము అంగీకరించలేదని, ప్రజలకు చెప్పారు. మరోసారి బుధవారం ఉదయం గ్రామంలో సభ నిర్వహించి పూర్తిగా చర్చిద్దామని నిశ్చయించుకున్నారు.