తెలంగాణ

జీఎస్టీ ఎగవేతపై కొనసాగిన విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్/మిర్యాలగూడ, సెప్టెంబర్ 22: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫోర్జరీ జీఎస్‌టీ బిల్లులు సృష్టించి పన్ను ఎగవేసిన తవుడు వ్యాపారులపై కేంద్ర వస్తు సేవా పన్ను (జీఎస్‌టీ) అధికారులు, ఆశాఖ ప్రధాన కార్యాలయం ఢిల్లీ, ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. 3 రోజులుగా సాగుతున్న విచారణ ఇంకా కొన్ని రోజులు సాగగలదని అధికారులు పేర్కొంటున్నారు. సమగ్ర విచారణ జరుపుతున్నట్టు జీఎస్‌టీ డిప్యూటీ కమిషనర్ అశోక్, అసిస్టెంట్ డైరెక్టర్ విఠల్ ఆదివారం తెలిపారు. ఏపీ, తెలంగాణాల్లోని వ్యాపారుల ఇళ్లలో సోదాలు, విచారణ కొనసాగుతూనే ఉందని, విచారణ అనంతరం ఏ మేరకు జీఎస్‌టీ ఎగవేశారో తెలుపుతామన్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, విజయవాడ, గుంటూరు, తెలంగాణాలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలకు చెందిన వ్యాపారులు జీఎస్‌టీ ఎగవేతలో ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఇరు రాష్ట్రాల్లో జీఎస్‌టీ విజిలెన్స్ అధికారులు 15 బృందాలుగా ఏర్పడి వ్యాపారులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మిర్యాలగూడకు చెందిన వ్యాపారులు సుమారు 10 మంది వరకు ఉన్నారు. వారిని స్థానిక కేంద్ర జీఎస్‌టీ కార్యాలయంలో విశాఖపట్నంకు చెందిన డిప్యూటీ కమిషనర్ అశోక్, అసిస్టెంట్ డైరెక్టర్ విఠల్ తదితర అధికారులతో కలిసి విచారణ చేస్తున్నారు. ఏటా సుమారు వందల కోట్ల రూపాయల విలువ చేసే తవుడు వ్యాపార లావాదేవీలు ఫోర్జరీ జీఎస్‌టీ బిల్లులపై చేశారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఆదాయం ప్రభుత్వ కోశాగారానికి రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. మిర్యాలగూడ, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, కోదాడ ప్రాంతాల్లో అధికంగా రైస్‌మిల్లులున్నాయి. బియ్యం తయారు చేసిన అనంతరం వచ్చే తవుడును గతంలో ఏజెంట్లు రవాణా చేసేవారు. ప్రస్తుతం రైస్‌మిల్లర్లు తవుడును రవాణా చేసే సమయంలో జీఎస్‌టీని ఎగవేసి కోట్లు దండుకోవచ్చన్న ఆలోచనతో స్వయంగానే రవాణాకు పూనుకున్నారు. మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్‌మిల్లుల, ఏజెంట్ల ఇళ్లలో కూడా జీఎస్‌టీ అధికారులు సోదాలు నిర్వహించారు. వారి బ్యాంకు పుస్తకాలు, హార్డ్ డిస్క్, పెద్ద మొత్తంలో నగదు నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లాలో సుమారు 300 రైస్‌మిల్లులుండగా మిర్యాలగూడ పట్టణం, మండల ప్రాంతంలోనే సుమారు 90 వరకు ఉన్నాయి. తవుడుకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉండటంతో మిల్లుల్లో ధాన్యం బియ్యంగా మార్చిన అనంతరం వస్తున్న 6 శాతం తవుడును స్థానికంగా ఉన్న తవుడు మిల్లుల్లో తక్కువ ధర వస్తుందని, వారికి విక్రయిస్తే 5 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి వస్తుందని వేరే ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న రైస్‌మిల్లర్లు సాల్వెంట్ పరిశ్రమలకు తవుడు విక్రయించకపోవడంతో 2 పరిశ్రమలు మూతపడ్డాయి.
అదేవిధంగా ఫోర్జరీ జీఎస్‌టీ తయారు చేసి రవాణా చేస్తూ వందల కోట్లు గడిస్తున్నారు. ఈ తతంగం జీఎస్‌టీ వచ్చిన నాటి నుండి జరుగుతూనే ఉందని సమాచారం. ఏటా 100 నుండి 200 కోట్ల రూపాయలు జీఎస్‌టీ ఎగవేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న జీఎస్‌టీ డిప్యూటీ కమిషనర్ అశోక్, ఏడీ విఠల్