తెలంగాణ

ఐటీఐఆర్‌ను నిర్వీర్యం చేసే యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 21: రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ఉన్నత లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ శాసన సభపక్ష నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే శ్రీ్ధర్ బాబుతో కలిసి మాట్లాడారు. ఐటీఐఆర్ వస్తే సుమారు 70 లక్షల మందికి ప్రత్యేకంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. యూపిఏకి, కాంగ్రెస్‌కు ఎక్కడ పేరు వస్తుందేమోనని దానిపై దృష్టి పెట్టడంలేదని విమర్శించారు. నిరుద్యోగాలు ఉద్యోగాలు కల్పించాలని ఓ వైపు డిమాండ్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఉదాసీనంగా వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. అతి కీలకమైన ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరితే ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడినట్టు వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి కీలకమైన అంశంపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా స్పీకర్ తమకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. ఐటీఐఆర్‌పై రాష్టవ్య్రాప్తంగా కాంగ్రెస్ ఉద్యమిస్తుందని చెప్పారు.
ప్రశ్నలు వారే...సమాధానాలూ వారే: సీతక్క
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ ఏక పక్షంగా కొనసాగతుందని, ప్రశ్నలు వారే వేసుకుంటూ వాటికి సమాదానాలను వారే ఇచ్చుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంతా ఈ ఐదేళ్లలోనే జరిగినట్టు చెబుతున్నారని, గత ప్రభుత్వాలు ఏమి చేయకుండానే హైదరాబాద్ ఈ స్థాయిలో అభివృద్ధి సాధించిందా అని ప్రశ్నించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రభుత్వం చిత్తశుద్దిని చాటుకోవాలని డిమాండ్ చేశారు.