తెలంగాణ

రాజ్యాంగబద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ విలీనం రాజ్యాంగబద్ధంగానే జరిగిందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్ సభ్యుడు డీ. శ్రీ్ధర్‌బాబు చేసిన వ్యాఖ్యలపై శాసనసభా వ్యవహారాల మంత్రి తీవ్రంగా స్పందించారు. మరో పక్క గండ్ర వెంకటరమణ సైతం చర్చలో జోక్యం చేసుకుంటూ శ్రీ్ధర్‌బాబు వ్యాఖ్యలను ఖండించారు. సభ్యుల వాదనలకు సమాధానం చెబుతూ స్పీకర్ కార్యాలయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవని, పార్టీ మార్పిడికి
సంబంధించి అన్ని దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని చెప్పారు. 12 మంది కాంగ్రెస్ సభ్యులు రాజ్యాంగబద్ధంగానే విలీనం టీఆర్‌ఎస్‌లో చేరారని, దానికి ఫిరాయింపులు అనే మాట వాడటం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో బీఎస్పీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఎలా ఆహ్వానించారని నిలదీశారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యులను బీజేపీ చేర్చుకోలేదా? ఇదేదో కొత్తగా జరిగిన అంశంలా శ్రీ్ధర్‌బాబు ప్రస్తావించడం సరికాదని గండ్ర వెంకటరమణ పేర్కొన్నారు. శ్రీ్ధర్‌బాబు తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. మార్చి 9 నుండి కాంగ్రెస్ సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరికకు సంబంధించి ప్రక్రియ మొదలైందని, వారిని అనర్హులను చేయాలని దీనిపై తాము ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా తగిన చర్యలను స్పీకర్ తీసుకోలేదని ఆరోపించారు. ఈ అంశంపై తాము ఏప్రిల్ 24నే పిటిషన్ ఇచ్చామని చెప్పారు. ఈ అంశంపై స్పీకర్ జోక్యం చేసుకుంటూ స్పీకర్ కార్యాలయంలో ఎలాంటి పిటిషన్లు పెండింగ్‌లో లేవని వాటిని పరిష్కరించడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ సభ్యుల విలీనానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ అయ్యిందని పేర్కొన్నారు.
త్వరలో అసెంబ్లీ కమిటీలు
త్వరలోనే అసెంబ్లీ కమిటీలను నియమించనున్నట్టు వేముల చెప్పారు. కొత్త సభ్యులు ఎక్కువ మంది పాల్గొన్నారని, శాసనసభను అర్ధవంతంగా జరుగుతోందని సభ్యులు అంతా చర్చలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. అన్ని పక్షాల నేతల సహకారంతోనే సభ ప్రశాంతంగా కొనసాగుతోందని అన్నారు. శాసనసభలో ఉన్న లైబ్రరీని కొత్త సభ్యులు వినియోగించుకోవాలని, అలాగే శాసనసభ్యుల కోసం ఇటీవలె 120 ఫ్లాట్లను ప్రారంభించామని, అదే విధంగా సభా హక్కుల కమిటీని సైతం త్వరలో నియమించబోతున్నామని అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కేటాయింపు అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని చెప్పారు. పరిపాలనా కమిటీల్లో శాసనసభ్యులను భాగస్వామ్యం కల్పిస్తామని తద్వారా వారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవడమవుతుందని తెలిపారు.