తెలంగాణ

అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందని ఆర్ధిక శాఖా మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. ఉద్యోగులు 42 శాతం ఫిట్‌మెంట్ అడిగితే ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని విస్మరించరాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వం ఆరో గ్య కార్డుల ద్వారా అందిస్తోందని అన్నారు. ఐఆర్‌పైనా త్వరలోనే సముచిత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రెండు లక్షల మంది తాత్కాలిక ఉద్యోగుల వేతనాలు పెంచడం వల్ల ప్రభుత్వంపై రూ.950 కోట్ల మేర భారం పడిందని, అయినా కాంట్రాక్టు,అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచామని చెప్పారు. అలాగే సచివాలయం షిఫ్టింగ్‌కు సంబంధించి ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రతి ఫైలుకూ కస్టోడియన్లను నియమించామని పేర్కొన్నారు. వారి సర్వీసు రిజిస్టర్లలోనే వాటిని నమోదు చేస్తున్నామని ఫైళ్లు అదృశ్యం అయ్యేందుకు వీలు లేదని అన్నారు. ఎంఐఎం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌లలో ఉర్దూలోనూ ప్రశ్నాపత్రాలు రూపొందించామని గుర్తుచేశారు.

*చిత్రం... ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు