తెలంగాణ

ఐటీఐఆర్ అభివృద్ధికి పైసా ఇవ్వలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హైదరాబాద్‌లో నెలకొల్పాలన్న ఐటీఐఆర్‌పై ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సవాలు చేశారు. గత యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీఐఆర్‌కు పైసా కూడా విడుదల చేయలేదని, ఒకవేల పైసా విడుదల చేసినట్లు నిరూపించగలరా అంటూ భట్టిపై కేటీఆర్ సవాల్ చేశారు. శనివారం శాసన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఐటీఐఆర్‌తో బహుళ ప్రయోజనాలను పొందకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం ఏమిటని మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. అందకు కేటీఆర్ సమాధానం చెబుతూ ఐటీఐఆర్ అనేది ప్రాజెక్టు కాదని, కేవలం సూత్రప్రాయ అంగీకారమని మంత్రి కేటీఆర్ సభ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌ను అడ్డుకున్నట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు. ఐటీఐఆర్‌పై ఇటీవల కేంద్రం మంత్రి హైదరాబాద్‌లో మాట్లాడుతూ ఐటీఐఆర్‌ను పక్కన పెట్టినట్లు చెప్పడం వాస్తవం కాదా అంటూ కేటీఆర్ నిలదీశారు. ఇలా వుంటే, పురపాలక చట్ట సవరణ బిల్లుకు శాసన సభ శనివారం ఆమోద ముద్ర వేసింది. గతంలో ఈ బిల్లుకు గతంలోనే ఆమోద ముద్ర పడినప్పటికీ, అప్పటి గవర్నర్ నరసింహన్ కొన్ని సూచనలు చేస్తూ తిప్పి పంపారు. దీనితో అవసరమైన సవరణ లతో పురపాలక చట్ట బిల్లును
ఆమోదించింది. ఐటీఐఆర్‌పై కాంగ్రెస్ నేతలు లేనిపోని అపోహాలు,
ఊహాగానాలు,భ్రమలను సృష్టించడంతో పాటు ప్రజలను మోసం చేయడమేనని కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఐటీ మంత్రి ఐటీఐఆర్‌పై అసత్యాలు చేబుతున్నారని భట్టి చెప్పగా..కాదుకాదు మీరే అబద్ధాలు చెబుతున్నారని మంత్రి భట్టిపై ఎదురుదాడికి దిగారు. దీనితో శాసన సభలో గందరగోళం నెలకొంది. భట్టి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొంత సేపు కొనసాగింది. కాంగ్రెస్ నేతలు కేవలం విమర్శిండానికే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు సమాచారం తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడడానికి సభకు వచ్చినుట్లుగా ఉందని భట్టిపై కేటీఆర్ విమర్శలు చేశారు. కేంద్రం ఐటీఐఆర్ కోసం రూ 3,275 కోట్ల పెట్టుబడితో 202 చదరపు కిలోమీటర్ల (49,913 ఎకరాలు) విస్ర్తిర్ణంలో ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు 20 సంవత్సరాల్లో వివిధ దశల్లో పూర్తి చేయడంతో ప్రత్యక్షంగా కోటి ఉద్యోగాలు పరోక్షంగా మరో 54 లక్షలు వస్తాయని అంచనా వేయడం జరిగిందన్నారు. అయితే ఇవేమీ పట్టనట్లుగా కేంద్రం ఐటీఐఆర్‌పై చడీచప్పుడు లేకుండా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగాల కోసం పరిశ్రమలను తీసుకురావడం జరుగుతోందన్నారు. ఐటీఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు కేంద్రంతో చర్చించడానికి ప్రయత్నించిందని మంత్రి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయంగా కొత్తగా ఐటీ క్లష్టర్లను ఏర్పాటు చేయడంతో ఉపాధి అవకాశాలకు ఊతం వచ్చిందన్నారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి వివిధ దేశాల ప్రతినిధులు హైదరాబాద్‌కు వచ్చి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ఏర్పాటుతో దాదాపు రూ 30 వేలకోట్లు ఆదాయం వస్తుందని కాంగ్రెస్ నేతలు ఊహాల్లో లెక్కలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఐటీ రంగంలో బెంగళూరు కంటే తెలంగాణ ముందుకు దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ చెప్పడంతో సభ్యులు బల్లలు తట్టారు. ఐటీఐఆర్‌ను 2013 నవంబర్‌లో కేంద్రం ప్రకటించిందన్నారు. రాబోవు రోజుల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయని మంత్రి కేటీఆర్ సభకు సూచించారు.