తెలంగాణ

శ్రీశైలం నుంచి నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, సెప్టెంబర్ 21: శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వస్తున్న వరదనీరు సమాంతరంగా వస్తుండటంతో ప్రాజెక్టులోని మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఆరుగంటల సమయానికి జూరాల నుంచి వరద గేట్ల ద్వారా 29,910 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తూ 45,207 క్యూసెక్కులు, సుంకేసుల డ్యాం నుంచి 44,460 క్యూసెక్కులు మొత్తం లక్షా 19,568 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 26,850 క్యూసెక్కులు, భూగర్భ విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 40,259 క్యూసెక్కులు, కేఎల్‌ఐ ద్వారా 1600 క్యూసెక్కులు, హంద్రీనీవా కాలువ ద్వారా 2026క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ ద్వారా 5వేల క్యూసెక్కులు, ప్రాజెక్టు గేట్లు మూడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 83,949 క్యూసెక్కులు మొత్తం లక్షా 60వేల 333 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
గడిచిన 24 గంటలలో కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 13.039 మిలియన్ యూనిట్లు, భూగర్భ విద్యుత్ కేంద్రం ద్వారా 19.944 మిలియన్ యూనిట్లు మొత్తం 33.083 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ గ్రిడ్‌కు అందించారు. శనివారం సాయంత్రానికి రిజర్వాయర్‌లో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకుగాను 884.80 అడుగులుగా, గరిష్ట నీటి నిలువ 215టీఎంసీలకుగాను 214.3637 టీఎంసీలుగా నమోదై ఉన్నది.
*చిత్రం...శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడుగేట్లతో నీటిని విడుదల చేస్తున్న దృశ్యం.